కరోన వేళ, నర్సుపై లైంగిక వేధింపులు..ఇంకేముంది చితక్కొట్టారు

  • Published By: madhu ,Published On : July 15, 2020 / 12:26 PM IST
కరోన వేళ, నర్సుపై లైంగిక వేధింపులు..ఇంకేముంది చితక్కొట్టారు

ఓ వైపు కరోనా విస్తరిస్తుంటే..దారుణ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వైరస్ ను అరికట్టేందుకు వైద్య సిబ్బంది అహర్నిశలు పని చేస్తుంటే..మరికొంతమంది వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు. ఇలాగే…చేసిన ఓ డాక్టర్ ను చావబాదారు నర్సులు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని సివిల్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది.

Panchkula సెక్టార్ 6లోని సివిల్ హాస్పిటల్ లో డాక్టర్ మనోజ్ కుమార్ మానిసక వైద్యుడు. కరోనా వైరస్ రోగులకు చేస్తున్న ఓ నర్సుపై లైంగికంగా వేధించాడంటూ నర్సుల సంఘం ఉన్నతాధికారులకు కంప్లైట్ చేశారు. కానీ వారు తగిన చర్యలు తీసుకోలేదంటూ..విచారణ సందర్భంగా వచ్చిన డా.మనోజ్ కుమార్ పై నర్సులు దాడి చేశారు. పిడిగుద్దులు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో వీడియో వైరల్ గా మారింది.

అసలేం జరిగింది : –
కోవిడ్ -19 ఐసోలేషన్ ఉన్న ఓ నర్సుపై శనివారం రాత్రి మద్యం సేవించి వచ్చిన మనోజ్ కుమార్ దాడి చేశాడని, అసభ్యంగా ప్రవర్తించాడని నర్సుల సంఘం అధ్యక్షురాలు కమల్జీత్ కౌర్ తెలిపారు. మాస్క్ తొలగించి మరీ వేధించాడని, ప్రతిఘటించిన ఆమెపై దాడి చేశాడని వెల్లడించింది. తన సహచరులకు, నర్సింగ్ ఇన్ ఛార్జీలతో పాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశామన్నారు.

రెండు రోజుల పాటు : –
కానీ ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు కనీసం ఫిర్యాదు చేయలేదని తెలిపారు. అధికారులు ఎవరైనా చర్యలు తీసుకుంటారేమోనని తాము రెండు రోజుల పాటు వెయిట్ చేశామని కమల్జీత్ కౌర్ తెలిపారు. అంతేగాకుండా..బాధితురాలిని మూడు రోజుల సెలవుపై పంపారని, కేసు నమోదు చేయడానికి వెళితే..మహిళా పీఎస్ కు వెళ్లాలని అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దీంతో తాము మహిళా కమిషన్ ను ఆశ్రయించినట్లు తెలిపారు.

మహిళా కమిషన్ : –
ఆసుపత్రి యాజమాన్యం వైఖరిపై మహిళా కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసుపై ఆసుపత్రి అధికారులు సమర్పించిన నివేదికపై ప్యానెల్ సంతృప్తి చెందలేని మహిళా కమిషన్ వైస్ ఛైర్మన్ ప్రీతి భరద్వాజ్ తెలిపారు.

పోలీసుల స్పందన : –
దీనిపై పోలీసులు భిన్నంగా స్పందించారు. మహిళా పీఎస్ లో FIR నమోదు చేశామని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు అసిస్టెంట్ పోలీసు కమిషనర్ నూపూర్ బిష్ణోయ్ తెలిపారు. వైద్యుడుని మాత్రం అదుపులోకి తీసుకోలేదని, స్టేట్ మెంట్ నమోదు చేయాల్సి ఉందన్నారు. వైద్యుడిని డిప్యూటేషన్ పై పంపించారని, పోలీసుల విచారణ జరుపుతున్నామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు, డాక్టర్ పై దాడి చేసిన వారిపై కూడా విచారణ జరుగుతుందని DGHS Dr. కాంభోజి వెల్లడించడం గమనార్హం.