తబ్లిగీ జమాత్ ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన UP డాక్టర్

  • Published By: nagamani ,Published On : June 2, 2020 / 05:22 AM IST
తబ్లిగీ జమాత్ ముస్లింలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన UP డాక్టర్

తబ్లిగీ జమాత్ (ముస్లిం సంస్థ) సభ్యులు ఉగ్రవాదులు.వాళ్లను పంపించాల్సింది హాస్పిటల్ కు కాదు అడవులకో..జైళ్లకో తరలించాలి అంటూ యూపీకి చెందిన ఓ డాక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాన్పూరులోని శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్తి లాల్ చందాని గత ఏప్రిల్ నెలలో చేసిన వ్యాఖ్యలు బైటకు రావటంతో ఇప్పుడా వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. తబ్లిగీల జమాత్ సంస్థ ఢిల్లీలో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశం తరువాత దేశ వ్యాప్తంగా కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిందనే వార్తలు వచ్చాయి.ఈ సందర్భంగా ఆమె అప్పట్లో ఆమె మాట్లాడుతుండగా కాన్పూరుకు చెందిన ఓ జర్నలిస్ట్ తీసిన వీడియో ఇప్పుడు బయటకొచ్చి వైరల్ గా మారింది. దీనిపై పెద్ద దుమారం రేగింది. 

ఈ వీడియోలు ఆమె మాట్లాడుతూ.. తబ్లిగీల వల్లే దేశం మొత్తం కరోనా వైరస్ వ్యాపించిందని..అటువంటివారు ఉగ్రవాదులతో సమానమనీ ఆరోపించారు. అటువంటివారిని హాస్పిటల్ లో పెట్టి ప్రభుత్వం మనం వీఐపీల్లా చూస్తున్నామని వ్యాఖ్యానించారు. చాలామంది వైద్యులు వారి వారి కుటుంబాలను వదలిసి క్వారంటైన్‌లో ఉండడానికి తబ్లిగీలే కారణమని అన్నారు. తబ్లిగీలను పంపాల్సింది ఆసుపత్రలకు కాదు..జైళ్లకో, అడవులో పంపాలని సూచించారు. 30 కోట్ల జనాభా వల్ల వంద కోట్ల జనాభా వారి వల్లే పలు ఇబ్బందులు ఎదుర్కొంటోందని చందాని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ఆర్థిక ఎమర్జెన్సీకి కారణం కూడా వీరేనని తీవ్రంగా మండిపడ్డారు.

చందాని వీడియో బయటకు వచ్చి  పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నానని వివరణ ఇచ్చారు. నిజానికి తాను ఎవరి పేరును ప్రస్తావించలేదనీ…కొంతమంది కావాలనే తనపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు. తనకు ముస్లింలంటే చాలా గౌరవం..ప్రేమ ఉందనీ..వారి కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని చందాని పేర్కొనడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న పెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓ ఆసుపత్రికి అధికారి ఆమె. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ రోగులకు అండగా ఉండి, వైరస్‌పై అవగాహన కల్పించాల్సిన బాధ్యతలో ఉన్నావిడ.. ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం వివాదాస్పదంగా మారింది.  దీంతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చినా..విమర్శలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

Read: దేశవ్యాప్తంగా కొత్తగా 8వేల 171 కరోనా కేసులు