పేషెంట్లను ట్రీట్ చేసే డాక్టర్‌కు 3 నెలల్లో రెండో సారి కరోనా

పేషెంట్లను ట్రీట్ చేసే డాక్టర్‌కు 3 నెలల్లో రెండో సారి కరోనా

ఒక సంవత్సరంలోనే రెండోసారి కరోనా.. కాదు మూడు నెలల్లోనే రెండోసారి. ఇజ్రాయేల్ లోని డాక్టర్ పరిస్థితి ఇది. ఇజ్రాయేల్ లోనే పెద్ద హాస్పిటల్ గా పేరు తెచ్చుకన్న రమత్ గన్స్ షెబా మెడికల్ సెంటర్ లో డాక్టర్ గా ఓ వ్యక్తి పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో తొలి కరోనా ఇన్ఫెక్షన్ ను కూడా గుర్తించింది అక్కడే. ఓ సారి వచ్చి తగ్గిపోయిన కరోనావైరస్ మళ్లీ అటాక్ చేయడంతో ఆమె మరింత కుంగిపోయారు.

టైమ్స్ ఆఫ్ ఇజ్రాయేల్ కథనం ప్రకారం.. ముందుగా ఈ సమాచారాన్ని టెల్ అవివ్ బ్రాడ్ కాస్ట్ స్టేషన్ ఛానెల్ 13నే బయటపెట్టింది. హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కు ఏప్రిల్ లో COVID-19 సోకింది. మే, జూన్ లో వరుస టెస్టులు చేసి డాక్టర్ రికవరీ అయినట్లే తేల్చారు. జులైలో మళ్లీ ఓ సారి టెస్టులు చేయగా ఆమెకు మరోసారి కొవిడ్ పాజిటివ్ వచ్చింది.

షెబా మెడికల్ సెంటర్ లో ఒకే పేషెంట్ ను రెండో సారి శ్వాస సంబంధిత సమస్య కంప్లైంట్ తో అడ్మిట్ చేసుకున్నారు. వైరస్ లక్షణాలు అందరిలోనూ ఒకేలా కనిపించవు. దక్షిణ కొరియా, కెనడా, అమెరికా వంటి దేశాల్లో కొత్త కొవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదవుతున్నాయి. మూడు నెలల్లోనే కేసులు రిపీట్ అవుతుండటంతో వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.

కరోనా వైరస్ ను ఎదుర్కొని బాడీలో తయారైన ఇమ్యూనిటీ, యాంటీబాడీలు సుదీర్ఘ కాలం శరీరంలో ఉండి శరీరాన్ని కాపాడలేకపోతున్నాయి. కొంతకాలం వరకే మానవ శరీరానికి రక్షణగా ఉంటాయని డాక్టర్లు అంటున్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారులు యాంటీ బాడీలు, వైరస్ ఇమ్యూనిటీకి మధ్య రిలేషన్‌షిప్ గురించి జులై 13న చర్చలు జరిపారు. హెల్త్ ఏజెన్సీ టెక్నికల్ కొవిడ్ 19 లీడ్ ఎపిడెమియాలజిస్ట్ డా. మారియా వాన్ కేర్‌ఖోవె అన్నారు. SARS-COV2 కారణంగా యాంటీబాడీలు ఒక స్థాయి వరకూ మాత్రమే యాంటీబాడీలను జనరేట్ చేయగలదు. ప్రొటెక్షన్ లోపిస్తే వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుందనని కేర్‌ఖొవె అన్నారు.