బైక్ గిఫ్ట్ ఇచ్చిన భార్య, భర్త బొటన వేలు కట్ అయ్యింది, సీన్ కట్ చేస్తే

బైక్ గిఫ్ట్ ఇచ్చిన భార్య, భర్త బొటన వేలు కట్ అయ్యింది, సీన్ కట్ చేస్తే

operation attaching thumb man : భర్తకు బైక్ లంటే యమ సరదా. బైక్ పై విన్యాసాలు చేయడం అంటే..అదొక పిచ్చి. దీంతో తన భర్తకు బైక్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంది. అనుకున్నట్లుగానే..బైక్ కొనిచ్చింది. కానీ..తర్వాత ఆ భార్య ఎంతో బాధ పడసాగింది. భార్య బాధ పడటానికి కారణం ఏంటీ అనుకుంటున్నారా ? భర్త బొటన వెలు తెగిపోవడమే కారణం. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

ముంబైలో రోహన్ అజ్ గాంకర్, భార్య జాగృతితో నివాసం ఉంటున్నాడు. ఇతనికి బైక్ లు అంటే ఇష్టమని తెలుసుకుంది. దీంతో ఓ బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. కొద్దిరోజుల అనంతరం బైక్ ను తుడుస్తున్నాడు. ఈ సమయంలో బైక్ ఆన్ చేసే ఉంది. ఈ క్రమంలో..అతడి ఎడమ చేయి బొటన వేలు ఛైన్ లో ఇరుక్కపోయింది. చేయి గట్టిగా వెనక్కు లాగాడు. అనంతరం చూడగా..రక్తం బొటబొటా కారుతోంది. ఏమైంది అనుకొనగా..కొద్ది దూరంలో…బొటనవేలి పై భాగం కనిపించింది. లబోదిబోమంటూ..ఆసుపత్రికి పరుగెత్తాడు. పరెల్‌లోని గ్లోబల్‌ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు దాదాపు ఏడు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి వేలిని అతికించారు. అయితే..తన గిఫ్ట్ ఇచ్చిన బైక్ తో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తూ..భార్య జాగృతి తెగబాధ పడుతోందంట.