కోవిడ్-19 చికిత్సకు నైట్రిక్ ఆక్సైడ్‌.. విషమ పరిస్థితిలో మెరుగైన వైద్యం కోసం!

  • Published By: vamsi ,Published On : August 21, 2020 / 07:32 AM IST
కోవిడ్-19 చికిత్సకు నైట్రిక్ ఆక్సైడ్‌.. విషమ పరిస్థితిలో మెరుగైన వైద్యం కోసం!

కరోనా మహమ్మారి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ప్రమాదకరంగా మారిపోయి ఉండగా.. వ్యాక్సిన్ కోసం, మందు కోసం శాస్వత పరిష్కారం కోసం పరిశోధకులు నిరంతరాయంగా శ్రమిస్తూ ఉన్నారు. వైరస్‌ను అడ్డుకొనేందుకు వీలైన అన్నీ మార్గాలను అన్వేషిస్తున్నారు పరిశోధకులు.



ఈ క్రమంలోనే మందు వచ్చేలోపు కోవిడ్-19 ట్రీట్మెంట్ కోసం డాక్టర్లు పలు పద్దతులను అనుసరిస్తున్నారు. కొవిడ్‌-19కు మందు లేకపోవచ్ఛు కానీ దాని దుష్ప్రభావాలను కట్టడి చేసే చికిత్సలు మాత్రం అందిస్తున్నారు. అందువల్లే ఎంతోమంది బతికి బట్ట కడుతున్నారు. మరణాల రేటు కూడా తక్కువగా ఉంది.

కోవిడ్-19 జబ్బు నియంత్రణ, చికిత్సలపై అవగాహన, అనుభవం పెరగటంతో కాస్త తీవ్ర పరిణమాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మొదట్లో ఊపిరితిత్తులను మాత్రమే కరోనా దెబ్బతీస్తుందని భావించినప్పటికీ ఇది ఒళ్లంతా ప్రభావం చూపుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. వైరస్‌ ప్రేరేపించిన వాపు ప్రక్రియే (ఇన్‌ఫ్లమేషన్‌) తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తోంది. రక్తం గడ్డకట్టే తీరు అస్తవ్యస్తమై సూక్ష్మ రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటం వలన ప్రాణాంతకం అవుతోంది.



ఈ విషయాలను అన్నింటిని బేరీజు వేసుకుంటూ నిపుణులు చికిత్సలో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేసుకుంటూ.. ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన మందులే ఇప్పుడు ప్రాణాలు కాపాడుతున్నాయి. కరోనా చికిత్సలో ముఖ్యమైన విషయం గంటకోసారి ఆక్సిజన్‌ శాతాన్ని పరీక్షించుకోవడం. ఆక్సిజన్‌ తగ్గుతుంటే చిన్న గొట్టం ద్వారా ముక్కులోకి ఆక్సిజన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అది చాలకపోతే మాస్క్ బిగించి ఆక్సిజన్‌ ఇవ్వాలి.

అయితే విషమ స్థితిలో నిరంతర పరిశీలన చాలా ముఖ్యం. ఆక్సిజన్‌ ఇచ్చే తీరునూ మార్చాల్సి వస్తుంది. మామూలు మాస్కులతో ఆక్సిజన్‌ అంతగా అందకపోతే నాన్‌ రీబ్రీతర్‌ మాస్కు వాడాల్సి ఉంటుంది. దీంతో ఆక్సిజన్‌ లోనికి వెళ్తుంది గానీ బయటకు లీక్‌ కాదు. ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా నియంత్రణకు చాలా దేశాల్లో ముక్కు ద్వారా నైట్రిక్‌ ఆక్సైడ్‌ ఇస్తున్నారు.



నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఎప్పుడు తెరిచి ఉండాలో? లేదా ఎప్పుడు మూసివేయాలో? అనే విషయాలను రక్త నాళాలకు చెబుతుంది. గుండె ద్వారా శరీరంలోకి ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. మన శరీరం సహజంగా రక్త నాళాల లైనింగ్‌లో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇది ఆక్సిజనేషన్ మరియు రక్త ప్రవాహానికి సహాయపడటానికి సంవత్సరాలుగా FDA- ఆమోదించిన చికిత్స. ఇప్పుడు COVID-19 కోసం ఉపయోగపడుతుంది.

నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉంటే రక్తపోటును తగ్గిస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. శరీరంలో రక్తం గడ్డకట్టకుంటా చూసుకోవడం ముఖ్యం. గుండె లోపంతో పుట్టిన శిశువులకు ఊపిరితిత్తులలో అధిక రక్తపోటుకు చికిత్స చేయడానికి నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉపయోగిస్తారు. హృదయ సంబంధ వ్యాధుల నుంచి అంగస్తంభన వరకు ప్రతిదానికీ చికిత్స చేయడానికి నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం దీనిని COVID-19 కోసం ఉపయోగిస్తున్నారు.