Corona Vaccination : వ్యాక్సిన్ ఇచ్చేందుకు పెద్ద సాహసమే చేసిన వైద్యులు.. వీడియో వైరల్

కరోనా సమయంలో ఆరోగ్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివి.. నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. ఓ వైపు కరోనా రోగులకు చికిత్స అందిస్తూనే మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్లి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణతోపాటు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కొండప్రాంతాల్లో జనాభా అధికంగా ఉంటుంది.

Corona Vaccination : వ్యాక్సిన్ ఇచ్చేందుకు పెద్ద సాహసమే చేసిన వైద్యులు.. వీడియో వైరల్

Corona Vaccination (5)

Corona Vaccination : కరోనా సమయంలో ఆరోగ్య సిబ్బంది అందించిన సేవలు మరువలేనివి.. నిద్రాహారాలు మాని పనిచేస్తున్నారు. ఓ వైపు కరోనా రోగులకు చికిత్స అందిస్తూనే మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్లి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణతోపాటు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కొండప్రాంతాల్లో జనాభా అధికంగా ఉంటుంది.

కొండలు గుట్టల్లో నివసించే వారు పట్టణాల్లోకి వచ్చి వ్యాక్సిన్ తీసుకోవడం అనేది అసంభవం. ఆ కొండల్లో ఉండేవారిలో చాలామందికి పట్టణం అనేది ఒకటి ఉంటుందని కూడా తెలిసి ఉండదు. ఇలాంటి వారికి టీకా ఇచ్చేందుకు ఆరోగ్య సిబ్బంది కొండలు, గుట్టలు, నదులు దాటుకుంటూ వారు ఉండే ప్రాంతానికి వెళ్తున్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ జిల్లా త్రాళ్ల గ్రామంలో ఇంటింటికి వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు వైద్య సిబ్బంది బయలుదేరారు.

ఆ గ్రామానికి వెళ్లాలంటే మార్గమధ్యంలో నదిని దాటాల్సి ఉంటుంది. అయితే వైద్య సిబ్బంది త్రాళ్ల గ్రామానికి వెళ్లేందుకు బయలుదేరారు. ఈ సమయంలో నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మొదట నది దాటేందుకు భయపడ్డారు. తర్వాత దైర్యం చేసి నదిని దాటారు. ఇక ఓ మహిళ వైద్యురాలు నది దాటుతుండగా ఆమెకు మరో వైద్యుడు సాయం చేశాడు. ఇక ఈ దృశ్యాలను త్రాళ్ల హెల్త్ సెంటర్ ఇంచార్జి డాక్టర్ ఇరామ్ యాస్మిన్ తన ఫోన్ లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైద్యులు చేసిన సాహసాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. తమ ప్రాణాలు లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వెళ్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.