గంగూలీకి మరో రెండు స్టెంట్ లు అమర్చిన వైద్యులు

గంగూలీకి మరో రెండు స్టెంట్ లు అమర్చిన వైద్యులు

Sourav-Ganguly

two more stents for Sourav Ganguly : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీకి గురువారం వైద్యులు యాంజియోప్లాస్టీ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఛాతీలో అసౌకర్యంగా బాధపడుతూ ఆయన బుధవారం ఆసుపత్రిలో చేరారు. వైద్యులు గంగూలీకి తాజాగా రెండు స్టెంట్‌లు అమర్చారు.

ప్రస్తుతం గంగూలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కరోనరీ ఆర్టినరీ పూడికలను తొలగించేందుకు గంగూలీకి అదనంగా రెండు స్టెంట్‌లు అమర్చామని తెలిపారు. ప్రస్తుతం ఆయనను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. ఆపరేషన్‌కు ముందు పలు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

48 ఏళ్ల గంగూలీ ఈ నెలలో రెండు సార్లు ఆసుపత్రి పాలయ్యారు. జనవరి 2న స్వల్ప గుండెపోటు రావడంతో ఆయనకు యాంజియోప్లాస్టీ ద్వారా ఒక స్టెంట్‌ను అమర్చారు. తాజాగా మరోసారి ఛాతీలో అసౌకర్యం ఏర్పడటంతో ఇంకో రెండు స్టెంట్‌లు వేశారు.