కోల్‌కతా పోలీసుల టీంలో లాడెన్‌ను చంపిన కుక్క బ్రీడ్

కోల్‌కతా పోలీసుల టీంలో లాడెన్‌ను చంపిన కుక్క బ్రీడ్

కోల్‌కతా పోలీసులకు ఆర్మీ నుంచి  ప్రత్యేకమైన బలం చేకూరింది. ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకునేందుకు  అమెరికన్లు వాడిన జాతి కుక్కను టీంలోకి చేర్చుకున్నట్లు గురువారం వెల్లడించారు. బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్‌కు చెందిన కుక్కను కోల్‌కతా పోలీసుల డాగ్ స్క్వాడ్‌లో చేరింది. 

కోల్‌కతా నగరంలో టెర్రరిస్టుల ఆనవాళ్లు కనిపించాయనే వార్తలు రావడంలో స్పెషల్ ఫోర్స్ ను సిద్ధం చేస్తున్నారు సిటీ పోలీస్. ఈ మేరకు పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఇటువంటి బ్రీడ్ తీసుకురావడానికి ముఖ్య కారణం ఉగ్రవాద ఆనవాళ్లను పసిగట్టడానికే. ప్రపంచంలో జరిగిన పలు కేసుల్లో ఈ విషయం రుజువైంది. 

ఈ కుక్క నివాసాన్ని స్టేట్ సెక్రటేరియట్ దగ్గర్లో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే శిక్షణ పొందిన ఓ కుక్కను టీంలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హోం శాఖ నుంచి మాకు అనుమతులు వచ్చాయి. ఓ సంవత్సరంలోగా ఇదే బ్రీడ్‌కు చెందిన మరికొన్ని కుక్కలను డాగ్ స్క్వాడ్‌లో చేర్చుకోనున్నారట.

CRPFలోకి బెల్జియన్ మాలినొయిస్ కుక్కలు చాలానే ఉన్నాయి. మహారాష్ట్ర పోలీసులు సైతం తమకు అదే బ్రీడ్ కుక్కలు పంపించమంటూ హోం శాఖకు లేఖ ద్వారా తెలిపారు. నక్సల్స్ ఉన్న ప్రాంతంలో వాటి సహాయంతో ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. భారత ఆర్మీ డాగ్ స్క్వాడ్‌లో 35రకాల బ్రీడ్స్ ఉన్నాయి. లాబ్రాడర్, డాబర్‌మాన్, జర్మన్ షెఫ్‌యార్డ్, బీగిల్ రాట్‌వీలర్, గోల్డెన్ రిట్రీవర్ లు కీలకం. 

హైదరాబాద్ డాగ్ స్క్వాడ్ లో 10 జర్మన్ షెఫ్‌యార్డ్‌లు, 2 లాబ్రాడర్స్ లు ఉన్నాయి. ఇదే బ్రీడ్ కు చెందిన కుక్క టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దగ్గరా ఉంది. దానిపేరు శామ్. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#belgiummalinois #sam ‘s mirroring talent ! ??? @mahi7781

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on