Delhi : ఢిల్లీలో కరోనా..కుక్కల స్మశాన వాటికలో దహనాలు

Delhi : ఢిల్లీలో కరోనా..కుక్కల స్మశాన వాటికలో దహనాలు

Dog

Dog Crematorium Site : దేశ రాజధాని ఢిల్లీ..కరోనాతో అతలాకుతలమవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉంటుండడంతో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా..ఫలితాలు అంతగా కనిపించడం లేదు. ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ లేకపోవడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.

గత కొన్ని రోజులుగా…రోజుకు 300 మంది చనిపోతుండడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రుల ఎదుట హృదయ విదాకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశానాల ఎదుట అంబులెన్స్ లు క్యూ కడుతున్నాయి. ఎక్కడ స్థలం దొరుకుతుందా అని మృతుల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి.

ద్వారకా సెక్టార్ 29లో కుక్కలకు సంబంధించిన శ్మశాన వాటికలో దహన సంస్కరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాత్కాలికంగా ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించాలని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు యోచిస్తున్నారు. మూడు ఎకరాల కుక్కల శ్మశాన వాటిక స్థలం ఆరు నెలల క్రితం నిర్మించారు.

ఇంకా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. ప్రస్తుతం ఢిల్లీలో 800 పైగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్య వేయికి పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పార్కులు, ఇతర స్థలాల్లో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. తుది కర్మలు నిర్వహించడానికి యమునా నది ఘాట్స్ వద్ద వేదికలు నిర్మిస్తున్నారు. పలు ప్రాంతాలను గుర్తించడం జరిగిందని నార్త్ ఢిల్లీ మేయర్ జై ప్రకాష్ వెల్లడించారు.

Read More :సీరం సీఈవోకి Y కేటగిరీ భద్రత..హోంశాఖ ఆదేశాలు