కుక్కను ఢీకొట్టబోయిన విమానం.. క్షణాల్లో

కుక్కను ఢీకొట్టబోయిన విమానం.. క్షణాల్లో

ఎయిర్ ఆసియా ఇండియా విమానం క్షణాల్లో కుక్కను ఢీ కొట్టబోయి తప్పించుకుంది. సెప్టెంబర్ 1న గోవా నుంచి బయల్దేరిన ఫ్లైట్ ఢిల్లీకి చేరాల్సి ఉంది. ఫ్లైట్ నెంబర్ 15778 ఉదయం 8గంటల 25నిమిషాలకు చేరుకోవాల్సి ఉంది. దాదాపు రన్ వే మీదకు వచ్చేసింది. ఇంతలో అకస్మాత్తుగా ఓ కుక్క పరిగెత్తుకుంటూ రన్‌వే మీద‌కు దూసుకొచ్చింది. 

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అప్రమత్తం చేయడంతో విమానాన్ని టేకాఫ్ చేయకుండా ఆపేశారు. పైలట్ కాసేపటి వరకూ గాల్లోనే తిరుగుతూ ఉదయం 9గంటల 15నిమిషాలకు టెక్నికల్ సిబ్బంది ద్వారా నిర్దారించుకుని ల్యాండ్ చేశారు. అధికారులు మాట్లాడుతూ.. ఓ వీధి కుక్క రావడంతో గోవా నుంచి ఢిల్లీ వచ్చే విమానాన్ని కాసేపటి వరకూ ల్యాండింగ్ కాకుండా ఆపినట్లు వెల్లడించారు. 

ఆలస్యమైన దానికి క్షమాపణ చెప్తూ భద్రత ముఖ్యమని అందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  గోవాలో ఎయిర్ పోర్టు దగ్గర్లో తిరుగుతున్న 60వీధి కుక్కలను జంతు సంరక్షణ డిపార్ట్‌మెంట్ వారిని తీసుకెళ్లాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎయిర్ఆసియా ఇండియా దేశవ్యాప్తంగా 22ఎయిర్ క్రాఫ్ట్‌లు 19గమ్య స్థానాలకు విమానాలను నడుపుతోంది.