Air India Business Class: పెంపుడు కుక్క కోసం విమానంలో బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసిన ఘనుడు

పెంపుడు కుక్కకు లగ్జరీ జర్నీ అందించాలని ఓ వ్యక్తి ఎయిరిండియాలో బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసేశాడు. ఎయిరిండియా విమానం AI-671లో కుక్క బుధవారం బయల్దేరింది.

Air India Business Class: పెంపుడు కుక్క కోసం విమానంలో బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసిన ఘనుడు

Airindia

Air India Business Class: పెంపుడు కుక్కకు లగ్జరీ జర్నీ అందించాలని ఓ వ్యక్తి ఎయిరిండియాలో బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసేశాడు. ఎయిరిండియా విమానం AI-671లో కుక్క బుధవారం బయల్దేరింది. ముంబై నుంచి చెన్నై వెళ్లే ఆ ఫ్లైట్ కోసం రూ. 2.5లక్షల వరకూ ఖర్చు పెట్టాడు ఆ యజమాని. ఈ టిక్కెట్ ధర ఒకక్కొరికీ కనీసం రూ.20వేలు ఉండొచ్చు.

‘ఎయిరిండియా A320 ఎయిర్‌క్రాఫ్ట్ బిజినెస్ క్లాస్ లో 12సీట్లు మాత్రమే ఉంటాయి. అలా క్యాబిన్ మొత్తానికి ఆ కుక్క ఒకటే ప్రయాణించింది’ అని ఇంగ్లీష్ మీడియా తెలిపింది.

గతంలో కూడా కుక్కలు ఎయిరిండియా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే బిజినెస్ క్లాస్ మొత్తం ప్రయాణించింది ఇదే తొలిసారి. దేశీయ పెంపుడు జంతువులకు అనుమతిచ్చే ఒకే ఒక్క విమాన సర్వీస్ ఎయిరిండియా. గరిష్ఠంగా రెండింటికి మాత్రమే విమానంలోకి అనుమతిస్తారు. అది కూడా బుక్ చేసుకున్న క్లాసులో చివరి వరుసలో కూర్చోబెడతారు.

గతేడాది జూన్ – సెప్టెంబర్ మధ్యలో ఎయిరిండియాలో 2వేల వరకూ పెంపుడు జంతువులను తీసుకెళ్లారు. దీపికా సింగ్ అనే సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ ఢిల్లీలోని ఓనర్లతో కలిపేందుకు ఆరు కుక్కలకు విమానం టిక్కెట్ బుక్ చేశారు.