వైరల్ వీడియో : హెల్మెట్ ధరించిన కుక్క.. గొప్ప సందేశమే ఇచ్చింది

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త మోటార్ వాహన చట్టం తీసుకొచ్చింది. ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేస్తూ ఈ కొత్త చట్టాన్ని తెచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణ దీని లక్ష్యం. చాలావరకు

  • Published By: veegamteam ,Published On : January 8, 2020 / 03:06 AM IST
వైరల్ వీడియో : హెల్మెట్ ధరించిన కుక్క.. గొప్ప సందేశమే ఇచ్చింది

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త మోటార్ వాహన చట్టం తీసుకొచ్చింది. ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేస్తూ ఈ కొత్త చట్టాన్ని తెచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణ దీని లక్ష్యం. చాలావరకు

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త మోటార్ వాహన చట్టం తీసుకొచ్చింది. ట్రాఫిక్ రూల్స్ ని కఠినతరం చేస్తూ ఈ కొత్త చట్టాన్ని తెచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణ దీని లక్ష్యం. చాలావరకు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేని  కారణంగా ప్రాణాలు పోతున్నాయి. అందుకే హెల్మెట్ రూల్ మస్ట్ చేసింది ప్రభుత్వం. అయినా కొంతమంది వాహనదారుల్లో మార్పు రావడం లేదు. హెల్మెట్ ధరించకుండానే వాహనం నడుపుతున్నారు. ఈ క్రమంలో  హెల్మెట్ ధరించడం ఎంత అవసరమో తెలిపింది ఓ శునకం. హెల్మెట్ ధరించిన కుక్క వీడియో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి బైక్ పై వెళ్తున్నాడు. అతడి వెనుకే ఓ కుక్క ఉంది. అతడు హెల్మెట్ పెట్టుకోవడంతో పాటు కుక్కకి కూడా హెల్మెట్ పెట్టాడు. ఆ శునకం చక్కగా హెల్మెట్ పెట్టుకుని వెనుక కూర్చోవడం  నెటిజన్లను తెగ అట్రాక్ట్ చేసింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

వాహనదారులకు గొప్ప సందేశం ఇచ్చిందని నెటిజన్లు ప్రశంసించారు. ఈ కుక్కను చూసి నేర్చుకోండని కామెంట్స్ చేశారు. హెల్మెట్ ఎంత ముఖ్యమో తెలుసుకోండి అని చెప్పారు. తన భద్రత కోసం శునకం హెల్మెట్  పెట్టుకుందని.. ఇది మంచి పని అని కితాబిచ్చారు. ఇక కుక్క కేర్ కోసం దాని యజమాని తీసుకున్న శ్రద్ద ప్రశంసనీయం అన్నారు. హెల్మెట్ పెట్టుకోవాలని కుక్కకి కూడా అర్థమైంది.. కానీ మనుషులకే అర్థం కావడం  లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

 

అదే సమయంలో దీన్ని కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. ఇది కరెక్ట్ కాదన్నారు. కుక్క యజమానిపై మండిపడ్డారు. ఏ మాత్రం పట్టుతప్పినా.. బైక్ నుంచి కుక్క కింద పడిపోతుందని, గాయపడుతుందని  హెచ్చరించారు. ఇది చాలా డేంజరస్ అని సీరియస్ అయ్యారు.