Ayodhya Muslim : గ్రామ్ ప్రధాన్‌గా ముస్లింను ఎన్నుకున్న అయోధ్య గ్రామస్తులు

హిందువుల ఆధిపత్యం ఉన్న అయోధ్య గ్రామంలో మత సామరస్యం వెల్లివిరిసింది. పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు ఓ ముస్లింను గ్రామ ప్రధాన్ గా ఎన్నుకున్నారు. రదౌలీ అసెంబ్లీ నియోజకవర్గం మావి బ్లాక్ లోని రజన్ పూర్ గ్రామంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గ్రామ పెద్దగా హఫీజ్ అజిముద్దీన్ ఖాన్ ను గ్రామస్తులు ఎన్నుకున్నారు.

Ayodhya Muslim : గ్రామ్ ప్రధాన్‌గా ముస్లింను ఎన్నుకున్న అయోధ్య గ్రామస్తులు

Ayodhya Muslim

Ayodhya Muslim : హిందువుల ఆధిపత్యం ఉన్న అయోధ్య గ్రామంలో మత సామరస్యం వెల్లివిరిసింది. పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు ఓ ముస్లింను గ్రామ ప్రధాన్ గా ఎన్నుకున్నారు. రదౌలీ అసెంబ్లీ నియోజకవర్గం మావి బ్లాక్ లోని రజన్ పూర్ గ్రామంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గ్రామ పెద్దగా హఫీజ్ అజిముద్దీన్ ఖాన్ ను గ్రామస్తులు ఎన్నుకున్నారు.

రజన్ పూర్ గ్రామం హిందువుల ఆధిపత్యం ఉన్న గ్రామం. మెజార్టీ ప్రజలు హిందువులే. ఆ గ్రామంలో ఉన్న ఏకైక ముస్లిం ఫ్యామిలీ హఫీజ్. గ్రామ ప్రధాన్ పదవి కోసం 8మంది అభ్యర్థులు పోటీపడ్డారు. అందులో హఫీజ్ ఏకైక ముస్లిం. పెన్షన్లు, ఇంటి పట్టాలు ఇప్పిస్తామని పోటీలో ఉన్న అభ్యర్థులు గ్రామస్తులకు తాయిలాలు ఇచ్చారు. అయినప్పట్టికి గ్రామస్తులు హఫీజ్ కే ఓటు వేశారు. మిగతావారిని తిరస్కరించారు. పంచాయతీ ఎన్నికల్లో అజీముద్దీన్ విజయం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.

ఇది తన విజయం కాదని.. హిందూ-ముస్లిం విజయం అని అజీముద్దీన్ అన్నాడు. నా విజయం హిందూ-ముస్లిం ఐక్యతకు నిదర్శనం. ఈ గ్రామానికే కాదు అయోధ్య మొత్తానికి అని చెప్పాడు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను. నిధులను వినియోగిస్తాను. మౌలిక సదుపాయాలు కల్పిస్తాను. ఎంఆన్ఆర్ఈజీఏ కింద ఉద్యోగాలు వచ్చేలా చూస్తాను అని అజీముద్దీన్ చెప్పాడు.

మా గ్రామంలోనే కాదు మొత్తం అయోధ్యలోనే.. హిందూ-ముస్లిం ఐక్యతకు అజీముద్దీన్ విజయం నిదర్శనం. అజీముద్దీన్ పోటీలో నిలిచిన రోజే, అతడికే ఓటు వేయాలని మెజార్టీ గ్రామస్తులు నిర్ణయించాం అని రాధే శ్యామ్ అనే గ్రామస్తుడు తెలిపాడు. అజీముద్దీన్ విజయంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.