Google Search : గూగుల్‌లో ఆ విషయాలు సెర్చ్‌ చేస్తే జైలుకే!

గూగుల్‌లో కొన్ని విషయాల గురించి సెర్చ్‌ చేస్తే జైలుకు వెళ్లడం ఖాయం. ముఖ్యంగా మూడు విషయాల గురించి సెర్చ్ చేస్తే జైలు ఊచలు లెక్కిస్తారు తస్మాత్ జాగ్రత్త.

Google Search : గూగుల్‌లో ఆ విషయాలు సెర్చ్‌ చేస్తే జైలుకే!

Google

Google Search : డిజిటల్‌ ప్రపంచంలో ఏ చిన్న సందేహం వచ్చినా ఇంటర్నెట్‌ను ఆశ్రయిస్తాం. గూగుల్‌, యూట్యూబ్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌ బింగ్‌, బైడూ, యాండెక్స్‌ వంటి సెర్చ్‌ ఇంజిన్లు చాలా ఉన్నప్పటికీ.. ఎక్కువమంది గూగుల్‌ వైపే మొగ్గు చూపుతారు. అయితే గూగుల్ లో ఏదంటే అది వెతకడానికి కుదరదు. క్రైమ్ ను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చాయి. గూగుల్‌లో కొన్ని విషయాల గురించి సెర్చ్‌ చేస్తే జైలుకు వెళ్లడం ఖాయం. ముఖ్యంగా మూడు విషయాల గురించి సెర్చ్ చేస్తే జైలు ఊచలు లెక్కిస్తారు తస్మాత్ జాగ్రత్త.

మొదటిది.. చిన్నారులకు సంబంధించిన పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గూగుల్‌లో వెతికితే శిక్షార్హులవుతారు. పొరపాటున సెర్చ్‌ చేసినా పోక్సో చట్టం కింద జైలుకు వెళ్లడం తప్పదు. ఈ నేరం కింద 5 నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Google Play Store : గూగుల్ నిషేధం ఈ రోజు నుంచే.. అన్ని కాల్ రికార్డింగ్ యాప్స్ పనిచేయవు..!

రెండోది.. బాంబులను ఎలా తయారు చేయాలని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే చిక్కులు తప్పవు. ఇటువంటి కంటెంట్‌ను వెతికినవారిని సెక్యూరిటీ సంస్థలు గుర్తిస్తాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

మూడోది.. అబార్షన్‌ చేయడం ఎలా? అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే జైలు పాలవుతారు. గర్భస్రావాలను నిరోధించేందుకు భారత్‌ కఠిన చట్టాలను రూపొందించింది. అబార్షన్‌కు సంబంధించిన కంటెంట్‌ను సెర్చ్‌ చేస్తే భారతీయ చట్టాల ప్రకారం శిక్షార్హులవుతారు. డాక్టర్‌ అనుమతితోనే గర్భస్రావానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. పై మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.