అచ్చెదిన్ అంటే ట్రంప్‌కు నమస్తే చెప్పటమేనా?..

  • Published By: veegamteam ,Published On : February 22, 2020 / 11:29 AM IST
అచ్చెదిన్ అంటే ట్రంప్‌కు నమస్తే చెప్పటమేనా?..

భారత్ కు అమెరికా అధ్యక్షడు ట్రంప్ వస్తున్నారు.ఆయనకు నమస్తే చెప్పండి..అదే అచ్చెదిన..70 లక్షల మందికి ఉద్యోగం వచ్చినట్లే. ఇదే ప్రధాని మోడీ నిరుద్యోగులకు ఇచ్చే ఉద్యోగం  అంటూ కాంగ్రెస్ పార్టీ ఓ సెటైరిక్ పోస్టర్ ను తయారు చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు కురిపించింది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాక సందర్భంగా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించింది. ట్రంప్ రాక సందర్భంగా 70 లక్షల మందిని తరలించి ‘నమస్తే ట్రంప్’  అని చెప్పించి ట్రంప్ కు స్వాగతం పలికించే ఉద్యోగాలను ప్రధాని మోదీ ప్రజలకు ఇస్తున్నారా? అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ట్రంప్ కు నమస్తే చెప్పటమేనా అచ్చెదిన్ అంటే అని ఎద్దేవా చేసింది. బీజేపీ అధికారంలోకి వస్తే అచ్చెదిన్ వస్తుందనీ ..నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని..వాగ్దానం చేసిన ప్రధాని మోడీ ‘‘నమస్తే ట్రంప్’’కార్యక్రమానికి లక్షలమందిని తరలించి  ‘‘నమస్తే ట్రంప్’’ అని చెప్పించటమేనా అచ్చెదిన్ అంటే అని ఎద్దేవా చేసింది. 

కాగా తాను భారత్ వెళితే తనకు కోటి మందితో ఘన స్వాగతం పలుకుతారని ప్రధాని మోడీ తనకు  హామీ ఇచ్చారని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. తనకు స్వాగతం పలికేవారిపై ట్రంప్ రోజుకో రకమైన లెక్కలు చెబుతున్నారు. ఒకసారి 10 లక్షలు అని మరోసారి 70లక్షలనీ కాదు కాదు కోటిమంది అని ఇలా రోజుకో లెక్కలు చెబుతున్నారు. అంతటి ఘన స్వాగతం తనకు లభిస్తుందని మోడీ తనకు మాట ఇచ్చారని ట్రంప్ చెప్పుకొస్తున్నారు. దీనిపై స్పందించిన  కాంగ్రెస్ పార్టీ శనివారం బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించింది.