తాజ్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ దంపతులు

  • Published By: venkaiahnaidu ,Published On : February 24, 2020 / 11:43 AM IST
తాజ్ అందాలకు ఫ్లాట్ అయిన ట్రంప్ దంపతులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సోమవారం(ఫిబ్రవరి-24,2020)సాయంత్రం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అడుగుపెట్టారు. ఆగ్రాలో అడుగుపెట్టిన అగ్రరాజ్యపు అధ్యక్షుడికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ స్వాగతం పలికారు. భార్య మెలానియాతో కలిసి ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ను ట్రంప్ సందర్శించారు. తాజ్ అందాలను సతీమణితో కలిసి ఆస్వాదించారు. చేతిలో చేయి వేసుకొని తాజ్ చుట్టూ కలియదిరిగారు.

స్థానిక గైడ్ తాజ్ విశేషాలను ట్రంప్ దంపతులకు వివరించారు. చాలా ఆశక్తిగా గైడ్ ను తాజ్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు ట్రంప్ దంపతులు. తాజ్ వెనుక భాగంలో ఉన్న యమునా నదిని కూడా ట్రంప్ దంపతులు వీక్షించారు. తాజ్ అందాలు చూసి ముగ్ధులయ్యారు ట్రంప్ దంపతులు. పర్యటనకు గుర్తుగా సందర్శకుల బుక్ లో ఓ సందేశం రాసి సంతకం పెట్టారు ట్రంప్ దంపతులు. ట్రంప్ కూతురు ఇవాంకా,అల్లుడు కుష్నార్ కూడా తాజ్ అందాలను వీక్షించారు. ఇవాంక దంపతులు తాజ్ దగ్గర ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

See Also>>వావ్..సూది బెజ్జంలో ట్రంప్‌ విగ్రహం!..తెలంగాణ మైక్రో ఆర్టిస్ట్ టాలెంట్

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన తాజ్ మహల్ ను సందర్శించిన రెండవ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. 2000సంవత్సరంలో అమెరికా అగ్రరాజ్యపు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాజ్ ను సందర్శించారు బిల్ క్లింటన్. ఆ తర్వాత  అమెరికా అధ్యక్షుడి హోదాలో 2015లో భారత పర్యటనకు వచ్చిన బరాక్ ఒబామా తాజ్ మహల్ ను సందర్శించాలనుకుని ముందుగా నిర్ణయించుకున్నప్పటికీ ఇతర కారణాల వల్ల ఆయన తాజ్ ను సందర్శించలేకపోయారు. ఆగ్రా పర్యటన తర్వాత ట్రంప్ బృందం ఢిల్లీకి బయలుదేరుతుంది. మంగళవారం రాత్రి వరకు ట్రంప్ ఢిల్లీలోనే ఉండనున్నారు.

ఆగ్రాలో అడుగుపెట్టేముందు అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటించారు.  అమెరికా నుంచి ఇవాళ ఉదయం ఢిల్లీలో కాకుండా నేరుగా అహ్మదాబాద్ లో దిగిన ట్రంప్ ఎయిర్ పోర్ట్ నుంచి 22కిలోమీటర్ల రోడ్ షోలో పాల్లొన్నారు. అనంతరం సబర్మతీ ఆశ్రమాన్ని ట్రంప్ దంపతులు సందర్శించారు.

Taj2.jpg