maharashtra corona : సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరికలు

మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. విదర్భను గడగడలాడిస్తున్న కరోనా ఇప్పుడు ముంబైకి కూడా పాకింది.

maharashtra corona : సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరికలు

Maharastra

impose lockdown : మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. విదర్భను గడగడలాడిస్తున్న కరోనా ఇప్పుడు ముంబైకి కూడా పాకింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో ఏకంగా 15 వేల కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇదే అధికం. నిన్నామొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా ఇప్పుడు పూనే, ముంబైలలో తీవ్రత చూపిస్తోంది. దీంతో మహారాష్ట్ర సర్కార్‌ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. లాక్‌డౌన్‌ విధించడానికి తాను వ్యతిరేకరమని .. అయితే పరిస్థితులు మరింతగా దిగజారితే ఏం చేయలమేని సీఎం ఉద్దవ్ థాక్రే అన్నారు.

మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 7 వేల 467 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 21,25,211కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 18 వేల 525 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు పేర్కొంది. కరోనా తీవత్ర నేపథ్యంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా మహారాష్ట్ర దారిలోనే నడుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు సంకేతాలిచ్చారు. ఆ రాష్ట్రంలో ప్రధాన పట్టణాలైన భోపాల్, ఇండోర్ లలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలున్నాయని సీఎం తెలిపారు. ఈ రోజు లేదా రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.