Covid Vaccine: అడ్రస్ ప్రూఫ్ లేదా.. వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హత లేనట్లే

అడ్రస్ ప్రూఫ్ లేకపోతే కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హత లేనట్లేనని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే ఆదేశం పాటిస్తున్నారు. యావత్ దేశమంతా..

Covid Vaccine: అడ్రస్ ప్రూఫ్ లేదా.. వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హత లేనట్లే

Covid Vaccine

Covid Vaccine: అడ్రస్ ప్రూఫ్ లేకపోతే కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి అర్హత లేనట్లేనని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే ఆదేశం పాటిస్తున్నారు. యావత్ దేశమంతా కరోనా మహమ్మారితో బాధపడుతుంది. ఈ నిర్ణయం తీసుకోండం దురదృష్టకరం.

వ్యాక్సినేషన్ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేయాలని అలహాబాద్ హైకోర్ట్ రీసెంట్ గా ఆదేశాలిచ్చింది. మూడు నుంచి నాలుగు నెలల్లోగా అందరికీ వ్యాక్సిన్ వేయాలని ప్లాన్ చేసింది

ఇద్దరు జడ్జిల బెంచ్ పిల్ పై వాదన వింటూ కొవిడ్ 19పై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని వ్యాక్సిన్ గురించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. అలా చేస్తే ఉత్తరప్రదేశ్ పాపులేషన్ మొత్తం మూడు నుంచి నాలుగు నెలల్లోపు వ్యాక్సిన్ పూర్తి డోస్ తీసుకోగలరు.

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా 18 నుంచి 44ఏళ్ల మధ్య వయస్కులకు కూడా వ్యాక్సిన్ ను సోమవారం నుంచి వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం ఆదివారం 17మునిసిపల్ కార్పొరేషన్లు, గౌతం బుద్ధ్ నగర్ ప్రాంతంలో డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు.