ఆ క్షణం కోసం ఆసక్తిగా : దీపాలు వెలిగించే ముందు శానిటైజర్లు వాడొద్దు

  • Published By: venkaiahnaidu ,Published On : April 5, 2020 / 05:37 AM IST
ఆ క్షణం కోసం ఆసక్తిగా : దీపాలు వెలిగించే ముందు  శానిటైజర్లు వాడొద్దు

కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మోడీ పిలుపుతో ఇవాళ రాత్రి దీపాలతో భారత్ వెలిగిపోయే దృశ్యం మనం మరికొన్ని గంటల్లో చూడబోతున్నాం.

దీపాలు వెలిగించేందుకు అందరూ రాత్రి 9గంటల సమయం ఎప్పుడవుతుందా అని ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రజలందరూ ప్రధాని పిలుపు మేరకు ప్రజలందరూ తమ తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించాలని ఏపీ,తెలంగాణ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,సెలబ్రిటీలు విజ్ణప్తి చేశారు

అయితే దీపాలు వెలిగించేవారు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీపాలు, కొవ్వొత్తులు వెలిగించే ముందు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లు వాడొద్దని సూచించింది. ఇలాంటి శానిటైజర్లు మంటలకు అంటుకునే ప్రమాదం ఉందని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌ కేఎస్‌ దాత్వాలియా హెచ్చరించారు.

మరోవైపు,ప్రజలు తమ ఇళ్లల్లోని లైట్లను మాత్రమే 9నిమిషాల పాటు ఆర్పాలని మోడీ విజ్ణప్తి చేశాడని,వీధి లైట్లు, తమ ఇళ్లల్లోని కంప్యూటర్లు,టీవీలు,ఫ్యాన్ లు రిఫ్రిజరేటర్లు,ఏసీలు ఆపాలని మోడీ పిలుపునివ్వలేదని  కేంద్ర విద్యుత్ శాఖ సృష్టం చేసింది. హాస్పిటల్స్ లోని లైట్లు మరియు ఇతర ఎసెన్షియల్ సర్వీసుల లైట్లు ఎప్పటిలాగానే ఆన్ లో ఉంటాయని తెలిపింది. కేవలం ఇళ్లల్లోని లైట్ ల స్విచ్ లు మాత్రమే ఆఫ్ చేయాలని మోడీ పిలుపునిచ్చారని తెలిపింది. ప్రజాభద్రత దృష్యా వీధి లైట్లు అన్నింటినీ ఆన్ లో ఉంచాలని అన్ని లోకల్ బాడీలకు సూచించడం జరిగిందని తెలిపింది.

అంతకుముందు కరోనాపై యుద్ధం చేస్తున్న డాక్టర్లు,నర్సులుచమెడికల్ సిబ్బందికి సంఘీభావంగా జనతా కర్ఫ్యూ(మార్చి-22,2020)రోజున సాయంత్రం 5గంటల సమయంలో తమ తమ ఇళ్ల బాల్కనీలోకి లేదా గుమ్మం దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టాలని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మోడీ పిలుపుకు విశేష స్పందన కూడా లభించింది. జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రం 5గంటల సమయంలో దేశమంతా చప్పట్లతో మార్మోగిపోయింది.