Tesla Cars in India: భారత్ లో అమ్మండి, కానీ చైనా నుంచి ఇక్కడికి తీసుకురాకండి: టెస్లా కంపెనీకి కేంద్ర మంత్రి గడ్కరీ సూచన

భారత్ లో టెస్లా కార్ల అమ్మకాలపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే ఇండియాలో తయారు చేసి ఇండియాలో అమ్మితేనే టెస్లాకు అనుమతి ఇస్తామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు

Tesla Cars in India: భారత్ లో అమ్మండి, కానీ చైనా నుంచి ఇక్కడికి తీసుకురాకండి: టెస్లా కంపెనీకి కేంద్ర మంత్రి గడ్కరీ సూచన

Gadkari

Tesla Cars in India: భారత్ లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా విద్యుత్ వాహనాలపై సబ్సిడీ ఇవ్వడంతో పాటు, టాక్స్ బెనిఫిట్స్ కూడా ప్రకటించింది కేంద్రం. ఈక్రమంలో అమెరికాకు చెందిన టెస్లా సంస్థ సైతం భారత మార్కెట్ పై గురిపెట్టింది. భారత్ లో టెస్లా కార్లను అమ్మెందుకు సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్ ఎంతో ఉత్సాహంతో ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్ లో టెస్లా కార్ల అసెంబ్లింగ్ కోసం స్థల సేకరణ నిమిత్తం కూడా సంస్థ ప్రతినిధులు పలు రాష్ట్రాల పరిశ్రమలశాఖలతో సంప్రదింపులు జరిపారు. అయితే విద్యుత్ కార్లపై భారత ప్రభుత్వం విధించిన ట్యాక్స్ విధానం తమకు కలిసి రాదంటూ టెస్లా వెనకడుగు వేసింది.

Also read:Prashant Kishor: ప్రశాంత్ కిశోర్, కాంగ్రెస్ లో ఎందుకు చేరడం లేదు? కారణం ఇదేనా

దీంతో తమ కార్లను నేరుగా ఇంపోర్ట్ చేసుకుని భారత్ లో విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరింది టెస్లా. అయితే ఇంపోర్ట్ చేసుకుంటే కార్ల ధర మరింత పెరగనుంది. దీంతో భారత్ లో టెస్లా కార్ల అమ్మకాలపై సందిగ్థత ఏర్పడింది. ఇక ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణాశాఖా మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. భారత్ లో టెస్లా కార్ల అమ్మకాలపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే ఇండియాలో తయారు చేసి ఇండియాలో అమ్మితేనే టెస్లాకు అనుమతి ఇస్తామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అలా కాదని చైనా నుంచి దిగుమతి చేసుకుని భారత్ లో అమ్ముతామంటే మాత్రం కుదరదని ఆయన స్పష్టం చేశారు.

Also read:Elon Musk buy Twitter: ఐదేళ్ల కిందట నెటిజన్ సవాల్.. ట్విట్టర్‌ను కొనేసిన మస్క్.. Viral Post

“కార్ల తయారీ కోసం మస్క్ కోరుకునే అన్ని సౌకర్యాలు, సాంకేతికత సామర్ధ్యం, మానవ వనరులు భారత్ లో ఉన్నాయి, దీంతో ఖర్చు కూడా తగ్గుతుంది” అని గడ్కరీ వివరించారు. “భారతదేశానికి వచ్చి తయారీ ప్రారంభించండి. భారతదేశం ఒక పెద్ద మార్కెట్. పోర్టులు అందుబాటులో ఉన్నాయి. ఎగుమతి సమస్య కాదు” అని కేంద్ర మంత్రి గడ్కరీ మస్క్ నుద్దేశించి చెప్పారు. భారత ఉత్పత్తులకు ప్రపంచ గుర్తింపు దక్కేలా, స్థానికంగా ఉద్యోగ కల్పనపై ద్రుష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం, “భారత్ లో తయారీ”కి పిలుపునిచ్చింది. దీంతో భారత్ లో పెట్టుబడులపై టెస్లా సంస్థ సంకోచంలో పడింది.

Also read:Elon Musk: మస్క్ ట్విటర్‌ను ఎలా సొంతం చేసుకున్నాడు.. ఏవేం మార్పులు చేయబోతున్నాడు..