హోళీ ఇలా చేస్తే అద్భుతం: అసలైన హోళీ ఇదే

  • Published By: veegamteam ,Published On : March 20, 2019 / 07:09 AM IST
హోళీ ఇలా చేస్తే అద్భుతం: అసలైన హోళీ ఇదే

అంబరాన్నంటే రంగుల సంబరం హోళీ. “మనుషుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది ఫుల్లుగా..ఒక్క రోజు దేశాన్ని చేస్తుంది కలర్‌ఫుల్‌గా”. ఈ హోళీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. దేశమంతా ఈ హోలీ పండుగని చాలా గ్రాండ్‌గా జరుపుకుంటున్నారు. సహజ రంగులను వదిలేసి కృత్రిమ కలర్స్‌తో సందడి చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలను వృధా చేస్తున్నారు. రంగుల వెనకున్న క్యారెక్టర్‌ని వదిలేసి కోడిగుడ్లతో కోలాహలం చేస్తున్నారు. పండగ చెప్పే మంచి విషయాన్ని మరిచి అనవసరమైన హడావుడి చేస్తూ… ఇదే ఆనందమని గెంతులేస్తున్నారు. మంచి మెసేజ్ ఇచ్చే రంగుల హోలీకి జబ్బు పట్టిస్తూ, జనాలూ రోగాల బారిన పడుతున్నారు.
Read Also :ఒకే ఇంట్లో తల్లీకొడుకుల మృతి : తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆగిన కుమారుడి గుండె

దేశ జనాభా రోజురోజుకు పెరుగుతూ పోతోంది. దీంతో పేదరికంతో తినడానికి తిండిలేక, ఉండటానికి ఇళ్లు లేక కొన్ని కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. సాయం చేసే చెయ్యి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వాళ్లని తలచుకుంటే ఇలా ఈ కృత్రిమ రంగుల హోలీకి కోడిగుడ్లతో, టమాటాలతో కోట్ల డబ్బును వృధా చేస్తున్నారు. ఆ రంగుల కోసం చేసే ఖర్చు ఎన్నో కడుపులు నింపుతుంది. మరెన్నో జీవితాల్లో వెలుగు నింపుతుంది.

కాబట్టి వృధాగా పోయే ఇలాంటి సొమ్ముని పనికొచ్చే పనికి ఉపయోగించండి. కృత్రిమ కలర్స్ వదిలేసి సాయం కోసం ఎదురుచూస్తున్న జీవితాల్లో కలర్స్ నింపండి. అప్పుడే రంగులు కూడా ఎన్నో హంగులు చూస్తాయి. కెమికల్స్‌ కూడిన కలర్స్ ఎవరికైనా మంచిది కాదు. వీటిని పూయడం, చల్లడం వల్ల ఇప్పుడే కాదు భవిష్యత్‌లోనూ ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి వీటి జోలికి వెళ్లకుండా ఆర్గానిక్ కలర్స్‌నే వాడండి.

నీటిని తక్కువగా వాడండి :
ఈ హోలీ పండుగ సమ్మర్‌లో వస్తుంది. ఈ సమయంలో నీటికొరత ఉంటుందని మనందరికి తెలిసిన విషయమే. అయినా ఒక్కరోజే కదా అనుకుంటాం. నిజమే కానీ, నీటిని కాస్తా పొదుపుగా వాడడం కూడా మంచిది. చాలా చోట్ల కనీస అవసరాలకు నీరు లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని నీటిని దుర్వినియోగం చేయకుండా వాడండి.
Read Also :చెక్ ఇట్..JEE MAIN హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి