CM Stalin నిర్ణయంపై ప్రశంసలు..స్కూల్ బ్యాగ్ లపై అమ్మ,పళనిస్వామి ఫొటోలు

తమిళనాడు సీఎం తీసుకున్న మరో ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు.

CM Stalin నిర్ణయంపై ప్రశంసలు..స్కూల్ బ్యాగ్ లపై అమ్మ,పళనిస్వామి ఫొటోలు

Stalin

CM Stalin తమిళనాడు సీఎం తీసుకున్న మరో ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఉచితంగా ఉద్దేశించిన 65లక్షల స్కూల్ బ్యాగ్ లపై మాజీ సీఎంలు జయలలిత,ఎడప్పాడి పళనిస్వామి ఫోటోలను కొనసాగించాలని,దీని వల్ల బ్యాగ్ లు మార్చాల్సి అవసరం ఉందని..తద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.13కోట్లు ఆదా అవుతాయని స్టాలిన్ నిర్ణయించారు. అలా ఆదా అయిన డబ్బుని విద్యార్ధుల కోసం ప్రవేశపెట్టే మరో సంక్షేమ పథకంలో వినియోగించాలని సీఎం స్టాలిన్.. తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమోజికి సూచించారు. దీంతో స్టాలిన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ అన్ని వైపులా నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

గురువారం తమిళనాడు అసెంబ్లీలో మంత్రి అన్బిల్ మహేష్ మాట్లాడుతూ..స్కూల్ బ్యాగ్ లపై ఫొటోల విషయమై నాకు పార్టీ వ్యక్తుల నుండి చాలా ఫిర్యాదులు వచ్చాయి. నేను ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి ఈ విషయాన్నితీసుకెళ్లినప్పుడు..నువ్వు మంత్రివి అయ్యావయ్యా..పార్టీ సభ్యుడిలా మాట్లాడకు అని నాకు చెప్పారు. నేను రాజకీయాల గురించి చర్చించాలనుకుంటే, నేను అరివలయం (డిఎంకె ప్రధాన కార్యాలయం) ని సందర్శిస్తాను అని మంత్రి పేర్కొన్నారు.

కాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పథకాల నుండి ప్రతిపక్షాల గుర్తులను అధికార పార్టీలు తొలగించడం మనదేశంలో సాధారణమైన విషయన్నది అందరికీ తెలిసిందే. అయితే దీనికి భిన్నంగా ప్రజాధనం వృద్ధా కాకుండా స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని అటు నాయకులు,ఇటు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా,ఈ ఏడాది మేలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత..జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించిన అన్నా క్యాంటీలను కొనసాగించడం సహా అనేక ఇటువంటి నిర్ణయాలను స్టాలిన్ తీసుకుని విపక్షాల ప్రశంసలను కూడా పొందిన విషయం తెలిసిందే.