Black Fungus: ‘బ్లాక్ ఫంగస్ వేరియంట్‌కు సంబంధించి కాదు’

దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతూ ఉన్నాయి. ఈ మ్యూకోర్మికోసిస్ సమస్యను వేరే రకంగా చూస్తున్న వారికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు టాప్ వైరాలజిస్ట్. కొవిడ్-19 వేరియంట్...

Black Fungus: ‘బ్లాక్ ఫంగస్ వేరియంట్‌కు సంబంధించి కాదు’

Black Fungus Corona

Black Fungus: దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతూ ఉన్నాయి. ఈ మ్యూకోర్మికోసిస్ సమస్యను వేరే రకంగా చూస్తున్న వారికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు టాప్ వైరాలజిస్ట్. కొవిడ్-19 వేరియంట్ కు బ్లాక్ ఫంగస్ కు సంబంధం లేదని చెప్తున్నారు.

‘బ్లాక్ ఫంగస్ అనేది ఏదో వేరియంట్ కు సంబంధించింది కాదు. చాలా కేసుల్లో దీనిని చూస్తున్నాం. ఎక్కువగా స్టెరాయిడ్లు తీసుకునే వారికి, డయాబెటిస్ తో బాధపడేవాళ్లకు ఇలాంటి కేసులు నమోదవుతాయి’ అని డా. గగన్‌దీప్ కంగ్, టాప్ వైరాలజిస్ట్ చెబుతున్నారు.

చనిపోయేందుకు దారి తీసే సమస్య ఇది. ఇలా 2-3వారాల నుంచి కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఇకపై కాస్త స్థిరంగా ఉంటాయని అనుకుంటున్నా. అలా జరగలేదంటే మన సిస్టమ్ లో ఎక్కడో సమస్య ఉన్నట్లే: డా. గగన్ దీప్ కంగ్, టాప్ వైరాలజిస్ట్ అంటున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మ్యుకోర్మికోసిస్ సమస్యను ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, 1897 కింద గుర్తించాల్సిన సమస్యగా మారింది.