CJI DY Chandrachud: ప్రధాన న్యాయమూర్తినే బెదిరిస్తారా? కోర్టు నుంచి వెళ్లిపోండి.. జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్ మధ్య వివాదం తలెత్తింది. వికాస్ సింగ్‌పై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రధాన న్యాయమూర్తినే బెదిరిస్తున్నారా? ఇలాగేనా ప్రవర్తించేది. కోర్టు నుంచి వెళ్లిపోండి’’ అని వికాస్‌పై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CJI DY Chandrachud: ప్రధాన న్యాయమూర్తినే బెదిరిస్తారా? కోర్టు నుంచి వెళ్లిపోండి.. జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం

CJI DY Chandrachud: భారత న్యాయవ్యవస్థకు సంబంధించిన ఇద్దరు కీలక వ్యక్తుల మధ్య సుప్రీం కోర్టు వేదికగా వాగ్వాదం జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్ మధ్య వివాదం తలెత్తింది. వికాస్ సింగ్‌పై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra Pradesh: రాజధాని కేసుల ముందస్తు విచారణ కోరిన ఏపీ.. నిరాకరించిన సుప్రీం కోర్టు

‘‘ప్రధాన న్యాయమూర్తినే బెదిరిస్తున్నారా? ఇలాగేనా ప్రవర్తించేది. కోర్టు నుంచి వెళ్లిపోండి’’ అని వికాస్‌పై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్ల ఛాంబర్ కోసం భూమి కేటాయింపులకు సంబంధించిన అంశం కారణంగా ఈ వాగ్వాదం తలెత్తింది. ఈ అంశాన్ని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఎదుట గురువారం వికాస్ సింగ్ ప్రస్తావించారు. ఈ పిటిషన్ విచారణకు వచ్చేలా చూసేందుకు తాము ఆరు నెలలుగా కష్టపడుతున్నట్లు చెప్పారు. ఈ ల్యాండ్‌లో నిర్మాణం కోసం ఒకే బ్లాక్ కేటాయించారని, గత చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ హయాంలోనే ఇక్కడ నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉందని వికాస్ సింగ్ అన్నారు.

Karnataka: ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే కొడుకు

ఈ అంశాన్ని విచారణకు తేవడానికి ఆరు నెలలుగా కష్టపడుతున్నామని, సాధారణ పిటిషన్‌దారుడిగానే తనను చూడాలని వికాస్ సింగ్ కోరారు. దీనికి స్పందించిన జస్టిస్ చంద్రచూడ్ ‘‘మీరు అలా డిమాండ్ చేయకూడదు. మేం రోజంతా అలా కూర్చునే ఉంటున్నామా’’ అని ప్రశ్నించారు. వెంటనే ‘‘మీరు రోజంతా అలాగే కూర్చుంటున్నారని నేను అనడం లేదు. ఈ అంశం విచారణకు వచ్చేలా మాత్రమే చూడాలనుకుంటున్నా. అలా చూడకపోతే ఈ అంశాన్ని మీ నివాసం వరకు తీసుకొస్తాం’’ అని వికాస్ సింగ్ అన్నాడు. దీంతో జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Manchu Manoj Marriage : మనోజ్ పెళ్ళి దగ్గరుండి చేస్తున్న మంచు లక్ష్మి.. సోషల్ మీడియాలో మెహందీ వేడుకలు, డెకరేషన్ ఫోటోలు పోస్ట్..

‘‘ప్రధాన న్యాయమూర్తిని ఇలా బెదిరించకూడదు. ఇలాగేనా ప్రవర్తించేది? కోర్టు నుంచి వెళ్లిపోండి’’ అంటూ ఆగ్రహంగా మాట్లాడారు. తను ఎవ్వరి బెదిరింపులకు లొంగనని, ఈ కేసు విచారణ ఈ నెల 17న జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కేసు విచారణ అనంతరం సీజేఐని కలిసిన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, నీరజ్ కిషన్‌ కౌల్ ఆయనకు క్షమాపణలు చెప్పారు.