టచ్ చేయొద్దు : అఖిలేష్ కి ఝలక్ ఇచ్చిన యోగి

  • Published By: venkaiahnaidu ,Published On : February 12, 2019 / 11:22 AM IST
టచ్ చేయొద్దు : అఖిలేష్ కి ఝలక్ ఇచ్చిన యోగి

యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. రాజధాని లక్నో నుంచి ప్రత్యేక విమానంలో అలహాబాద్ వెళ్లేందుకు బయల్దేరిన ఆయనను విమానం ఎక్కనివ్వకుండా ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నారు.  దీనిపై అఖిలేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగి నేతృత్వంలోని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షంపై నిర్బంధం విధించి హక్కులను కాలరాస్తోందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టచ్ చేయవద్దంటూ తనను అడ్డుకున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమాజ్ వాదీ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ది సమాజ్ వాదీ పార్టీ ఛాత్ర సభ అలహాబాద్ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకుంది.మంగళవారం(ఫిబ్రవరి-12) యూనివర్శిటీలో జరిగే స్టూడెంట్స్  యూనియన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లేందుకులక్నోలోని చౌదరి చరణ్ సింగ్ ఎయిర్ పోర్ట్ కి మంగళవారం(ఫిబ్రవరి-12) చేరుకున్న అఖిలేష్ ని విమానం ఎక్కనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. యూనివర్శిటీ కార్యక్రమానికి హాజరుకానివ్వకుండా ప్రభుత్వం అడ్డకుందంటూ  ఎయిర్ పోర్ట్ బయట మీడియాతో మాట్లాడుతూ అఖిలేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తనను పోలీసులు అడ్డుకున్న ఫోటోలను అఖిలేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

2018, డిసెంబర్ 27నే తన పర్యటన ఖరారైందని, ఎటువంటి లిఖితపూర్వక ఆర్డర్స్ లేకుండా తనను విమానం ఎక్కనివ్వకుండా యోగి సర్కార్ కుట్ర పన్నిదంటూ అఖిలేష్ నిప్పులు చెరిగారు. అయితే స్టూడెంట్ యూనియన్ల మధ్య ఉద్రిక్తలకు దారితీసే అవకాశం ఉందనే సమాచారం ఆధారంగానే లా అండ్ ఆర్డర్ ను కాపాడటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. 

ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ..ఇది ప్రజాస్వామ్య రహిత చర్య అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమ కూటమి రాజకీయ కార్యక్రమాలను ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీకి చెందిన ఏబీవీపీ విద్యార్థి విభాగం అఖిలేష్ యూనివర్శిటీ పర్యటనను నిరసిస్తూ అలహాబాద్ యూనివర్శిటీలో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: మనిషి బ్రతకటం కష్టమే : 100 ఏళ్లకు పురుగులు అంతం