ఫైళ్లను నాలుక తడితో తిప్పొద్దు యూపీ ప్రభుత్వం ఆర్డర్స్

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 06:56 AM IST
ఫైళ్లను నాలుక తడితో తిప్పొద్దు యూపీ ప్రభుత్వం ఆర్డర్స్

సాధారణంగా మనం పుస్తకాల్లోని పేజీలను, కరెన్సీ నోట్లను లెక్కపెట్టేటప్పుడు, ఫైళ్లను తిప్పటం కోసం నాలుకపై తడిని ఉపయోగించి తిప్పుతుంటాం. అలాంటి అలవాటుని మానివేయాలని ఉత్తరప్రదేశ్ లోని రాబరేలికి చెందిన ఛీప్ డెవలపమెంట్ ఆఫీసర్(CDO) అభిషేక్ గోయల్ అధికారులకు, ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేశారు.

అధికారులు, ఉద్యోగులు ఫైల్స్ ను తిప్పటం కోసం ఉమ్మును ఉపయోగించటం వల్ల అంటువ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందువల్ల  ఆ అలవాటును తొలిగించటం వల్ల అంటువ్యాధులు రాకుండా ఉంటాయని అభిషేక్ గోయల్ అన్నారు.

ఇక నుంచి జిల్లా స్ధాయి అధికారులు, బ్లాక్ డెవలప్ మెంట్ అధికారులు ఫైల్స్ ను, పేజీలను తిప్పటం కోసం వాటర్ స్సాంజిలను ఉపయోగించాలని అధికారులను ఆదేశించినట్లు ఉత్తర్వులో ఉంది. ఈ  ఉత్తర్వులకు సంబంధించిన నివేదికను మూడు రోజుల్లోగా సిడిఓ కార్యాలయానికి  అందించాలని లేఖలో పేర్కొన్నారు.