ఆ పార్టీలకు ఓటేసి వృథా చేయొద్దు : మమత

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సీపీఎం, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో ఓటు వేసి ప్రజలు తమ ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు.

  • Published By: sreehari ,Published On : April 13, 2019 / 01:56 PM IST
ఆ పార్టీలకు ఓటేసి వృథా చేయొద్దు : మమత

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సీపీఎం, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో ఓటు వేసి ప్రజలు తమ ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు.

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సీపీఎం, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండు పార్టీలకు ఎన్నికల్లో ఓటు వేసి ప్రజలు తమ ఓటును వృథా చేసుకోవద్దని సూచించారు. శనివారం (ఏప్రిల్ 11, 2019) సిలిగురిలో నిర్వహించిన ర్యాలీలో మమతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ వైఖరి నచ్చని కారణంగానే పార్టీ నుంచి బయటకు వచ్చి  తృణమూల్ పార్టీని స్థాపించినట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు చేతులు కలిపి.. ఆర్ఎస్ఎస్ సాయంతో కాంగ్రెస్.. బెంగాల్ లో పోటీ చేయడంపై మమతా విమర్శలు గుప్పించారు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొందని టీఎంసీ సుప్రిమో ఆరోపించారు. 

మమత ఆరోపణలపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్.. రాఫెల్ వివాదం, చౌకీదార్ చోర్ హై నినాదాన్ని లేవనెత్తారు. బీజేపీతో కాంగ్రెస్ ఎన్నడూ ఏ రాష్ట్రంలో కూడా రాజీ పడే ప్రసక్తే లేదని రాహుల్ స్పష్టం చేశారు. మమతా హయాంలో బెంగాల్ లో అభివృద్ధి శూన్యమంటూ ఇటీవల నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ఆరోపించారు. రాహుల్ ఆరోపణలపై మమతా స్పందిస్తూ.. అతడోక పిల్లాడు అంటూ కొట్టిపారేశారు. ఈ ఏడాది ఎన్నికల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తృణమూల్ కీలక పాత్ర పోషిస్తుందని మమతా తెలిపారు.