Door To Door Vaccine : ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వండి..అధికారులకు మోదీ సూచన

కోవిడ్ వ్యాక్సిన్‌లను ఇప్పుడు ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు అందించాల్సిన అవసరముందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అదేవిధంగా, వ్యాక్సిన్ సెకండ్ డోస్‌పై సమాన దృష్టి పెట్టాలని..

Door To Door Vaccine : ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వండి..అధికారులకు మోదీ సూచన

Pm

Door To Door Vaccine  కోవిడ్ వ్యాక్సిన్‌లను ఇప్పుడు ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు అందించాల్సిన అవసరముందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అదేవిధంగా, వ్యాక్సిన్ సెకండ్ డోస్‌పై సమాన దృష్టి పెట్టాలని..ఎందుకంటే ఇన్ఫెక్షన్ కేసులు తగ్గడం ప్రారంభించినప్పుడల్లా, కొన్నిసార్లు ఆవశ్యకత తగ్గుతుందని మోదీ అన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గడం మంచిది కాదని మోదీ హెచ్చరించారు.

వ్యాక్సినేషన్ పంపిణీ తక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు అధికారులతో బుధవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు ప్రధాని మోదీ. ఇటీవలే జీ20, కాప్26 సదస్సులకు హాజరైన మోదీ.. భారత్​ కు తిరిగి వచ్చిన వెంటనే ఈ సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో.. తొలి డోసు కవరేజీ 50 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..100 కోట్ల డోసులు పంచేశామని అజాగ్రత్త వహిస్తే మరో సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. వ్యాధులను, శత్రువులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదన్నారు. వ్యాక్సినేషన్ కవరేజీ పెంచేందుకు వినూత్న పద్ధతులను పాటించాలని అధికారులకు మోదీ సూచించారు.

గ్రామ, పట్టణాల స్థాయిలో వినూత్న పద్ధతులు పాటించి వ్యాక్సినేషన్ వేగం పెంచాలని అన్నారు. అవసరమైతే గ్రామ, పట్టణాల స్థాయిలో 20-25 మందితో బృందాలు ఏర్పాటు చేయవచ్చన్నారు. ఇప్పటివరకు వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి.. సురక్షితంగా వ్యాక్సిన్స్ లు ఇచ్చారని…ఇప్పుడు హర్ ఘర్ టీకా.. ఘర్ ఘర్ టీకా(ఇంటింటికి వ్యాక్సిన్) స్ఫూర్తితో ప్రతి ఇంటికి వెళ్లి వ్యాక్సిన్ లు ఇవ్వాలని మోదీ సూచించారు. వ్యాక్సిన్ పంపిణీలో అపోహలు, పుకార్ల రూపంలో సవాళ్లు ఎదురవుతాయని,ఈ నేపథ్యంలో వీలైనంత మందికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం స్థానిక మతపెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు.

జార్ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్​ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. వ్యాక్సిన్ పంపిణీ తక్కువగా ఉన్న 40 జిల్లాల్లో చాలా వరకు ఈ రాష్ట్రాలకు చెందినవే ఉన్నాయని ప్రధాని కార్యాలయం తెలిపింది.

ALSO READ Extra Marital Affair : భూతవైద్యం చేసే మహిళతో వివాహేతర సంబంధం….