Internet Calling: ఇంటర్నెట్ కాల్స్‌పై ప్రభుత్వ నియంత్రణ.. వీటికీ లైసెన్స్ తప్పనిసరి.. త్వరలో కొత్త రూల్స్

వాట్సాప్, గూగుల్ మీట్ వంటి సంస్థలు వాయిస్ ఆధారిత కాల్స్‌ను ఉచితంగా అందిస్తుండటంపై టెలికాం కంపెనీలు భగ్గుమంటున్నాయి. ఈ సేవలకు కూడా ఆయా సంస్థల నుంచి లైసెన్స్ ఫీజు వసూలు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో ఇప్పుడు ఈ కాల్స్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Internet Calling: ఇంటర్నెట్ కాల్స్‌పై ప్రభుత్వ నియంత్రణ.. వీటికీ లైసెన్స్ తప్పనిసరి.. త్వరలో కొత్త రూల్స్

Internet Calling: ఇంటర్నెట్ ఆధారిత వాయిస్ కాల్స్‌పై నియంత్రణ విధించేందుకు సిద్ధమవుతోంది కేంద్రం. వాట్సాప్, గూగుల్ మీట్, గూగుల్ డ్యుయో, ఫేస్‌బుక్, వైబర్, స్కైప్, సిగ్నల్ వంటి సోషల్ మీడియా యాప్స్ అందించే వాయిస్ కాలింగ్ సేవలు ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి రానున్నాయి.

Viral video: జిమ్‌లో వర్కవుట్ చేస్తూ తలకిందులైన మహిళ.. స్మార్ట్‌వాచ్‌తో ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్.. వీడియో వైరల్

ఈ కాల్స్‌ను త్వరలోనే రెగ్యులేట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా)తో టెలికాం శాఖ చర్చలు జరుపుతోంది. టెలికాం ప్రొవైడర్లకు వర్తించే రూల్సే సోషల్ మీడియా కమ్యూనికేషన్ యాప్స్‌కూ వర్తించేలా చట్టం చేయనున్నారు. ఈ నిర్ణయం ఇప్పటిది కాదు. 2016లోనే ఇంటర్నెట్ ఆధారిత కాల్స్‌పై టెలికాం ప్రొవైడర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పట్నుంచి ‘వన్ సర్వీస్.. వన్ రూల్’ విధానాన్ని పాటించాలని టెలికాం ఆపరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. దీని ప్రకారం.. ఇకపై కాలింగ్ ఫెసిలిటీ అందించాలంటే సోషల్ మీడియా యాప్స్.. లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిందే.

Tamil Nadu: పొదల్లో శిశువు మృతదేహం.. స్కూల్లోనే ప్రసవించి, వదిలేసిన బాలిక

ప్రస్తుతం ఇంటర్నెట్ కాలింగ్ సర్వీస్ ఉచితంగా లభిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ టెలికాం కంపెనీలు కోరినట్లుగా, ఇంటర్నెట్ కాలింగ్ సౌకర్యానికి కూడా ఫీజులు వసూలు చేస్తే ఈ సేవలు కూడా వినియోగదారులకు మరింత భారంగా మారే అవకాశం ఉంది. వీటికీ వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.