Penalties: మూడు వారాల్లో రూ.3,050కోట్ల జరిమానా కట్టండి!

టెలికాం పరిశ్రమ కోసం ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో సంతోషంగా ఉన్న భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

Penalties: మూడు వారాల్లో రూ.3,050కోట్ల జరిమానా కట్టండి!

Trai

Airtel and Vodafone fined: టెలికాం పరిశ్రమ కోసం ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో సంతోషంగా ఉన్న భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐదేళ్ల క్రితం పాయింట్ ఆఫ్ ఇంటర్‌కనెక్ట్ నిబంధనలపై TRAI సిఫార్సుల ఆధారంగా టెలికమ్యూనికేషన్ల విభాగం(DoT) వోడాఫోన్ ఐడియాపై రూ.2వేల కోట్లు, భారతీ ఎయిర్‌టెల్‌పై రూ.1050కోట్లు జరిమానా విధించింది. జరిమానా చెల్లించడానికి టెలికాం శాఖ లేటెస్ట్‌గా టెలికాం కంపెనీలకు మూడు వారాల గడువు ఇచ్చింది. టెలికాం శాఖ ఈమేరకు కంపెనీలకు డిమాండ్ నోటీసులు అందజేసింది.

2016లో రిలయన్స్‌ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆ నెట్‌వర్క్‌తో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా కంపెనీలు ఇంటర్‌ కనెక్టివిటీను నిలిపివేశాయని, కొత్త ఆపరేటర్ రిలయన్స్ జియోకు పాయింట్ ఆఫ్ ఇంటర్‌కనెక్ట్ నిబంధనలకు సంబంధించి 2016లో TRAI చేసిన సిఫారసుల ఆధారంగా DoT చేసిన ఏకపక్షమైన డిమాండ్ వినిపించిందని, ఈ విషయం మాకు తీవ్ర నిరాశ కలిగించిందని భారతీ ఎయిర్‌టెల్ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవి మరియు ఉద్దేశపూర్వకమైనవిగా ఎయిర్‌టెల్ ఆరోపిస్తోంది.

భారతీ ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. మా సంస్థ ఉన్నత ప్రమాణాలను పాటించడం విషయంలో రాజీ పడట్లేదని, ఈ విషయంలో కంపెనీ గర్వపడుతుందని, ఎప్పుడూ భారతీయ చట్టాలకు కట్టుబడి మేం పనిచేస్తున్నామని చెప్పారు. డిమాండ్ నోటీసును సవాలు చేస్తామని చెప్పిన కంపెనీ, మాకు అందుబాటులో ఉన్న ప్రతి చట్టపరమైన విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. వొడాఫోన్ ఐడియా మాత్రం ఈ విషయమై ఏమీ స్పందించలేదు.

అక్టోబర్ 2016లో, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) రిలయన్స్ జియోకి ఇంటర్ కనెక్టివిటీని అందించనందుకు ఎయిర్‌టెల్, వోడాఫోన్ మరియు ఐడియా(విలీనానంతర వొడాఫోన్ ఐడియా)పై రూ .3050 కోట్ల జరిమానా విధించాలని సిఫార్సు చేసింది. ఆ సమయంలో, రెగ్యులేటర్ ఈ మూడు కంపెనీల టెలికాం లైసెన్సుల రద్దును సిఫారసు చేయడానికి నిరాకరించింది.

రిలయన్స్ జియో ఫిర్యాదు తర్వాత TRAI ఈ సిఫార్సు చేసింది. జియో వినియోగదారులు ఆ నెట్‌వర్క్‌లకు చేసిన 75శాతం కాల్స్‌ తిరస్కరణకు గురయ్యాయని అప్పట్లో జియో ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో చర్యలు చేపట్టిన రెగ్యులేటరీ అథారిటీ.. తొలుత ఈ టెలికాం సంస్థల లైసెన్సులను రద్దు చేయాలని భావించింది. కానీ, వినియోగదారులకు అసౌకర్యాన్ని గమనించి, సంస్థలకు జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు నిర్ణయాన్ని తీసుకుంది.