Remdesivir Dropped : ప్లాస్మా బాటలోనే రెమ్‌డెసివిర్..? కరోనా చికిత్స నుంచి తొలగించే చాన్స్..?

కరోనా చికిత్స నుంచి రెమ్ డెసివిర్ ఔషధాన్ని త్వరలోనే తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రి చైర్ పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ప్లాస్మా థెరపీ తరహాలోనే ఇది కూడా కొవిడ్ బాధితులపై ప్రభావం చూపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడమే కారణం అని తెలిపారు. దేశవ్యాప్తంగా రెమ్ డెసివిర్ కు డిమాండ్ పెరుగుతున్న నేపత్యంలో డాక్టర్ రాణా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Remdesivir Dropped : ప్లాస్మా బాటలోనే రెమ్‌డెసివిర్..? కరోనా చికిత్స నుంచి తొలగించే చాన్స్..?

Remdesivir

Remdesivir May Be Dropped : కరోనా చికిత్స నుంచి రెమ్ డెసివిర్ ఔషధాన్ని త్వరలోనే తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రి చైర్ పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ప్లాస్మా థెరపీ తరహాలోనే ఇది కూడా కొవిడ్ బాధితులపై ప్రభావం చూపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడమే కారణం అని తెలిపారు. దేశవ్యాప్తంగా రెమ్ డెసివిర్ కు డిమాండ్ పెరుగుతున్న నేపత్యంలో డాక్టర్ రాణా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

కొవిడ్-19 రోగుల చికిత్సలో రెమ్‌డెసివిర్‌ను కూడా త్వరలో తొలగించవచ్చని భావిస్తున్నట్లు డాక్టర్ డీఎస్ రాణా చెప్పారు. కరోనావైరస్ రోగుల చికిత్సకు ప్లాస్మాను ఉపయోగించడంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సలహా ఇచ్చిన తర్వాత డాక్టర్ రాణా ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ రోగుల చికిత్సలో ప్లాస్మా ప్రభావంపై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కరోనా చికిత్స నుంచి ప్లాస్మాను ఐసీఎంఆర్ తొలగించిందని డాక్టర్ రాణా చెప్పారు.

కరోనా వైరస్ దాడి చేసినపుడు ప్రతిరోధకాలు సాధారణంగానే ఏర్పడతాయని ఆయన తెలిపారు. కరోనా రోగికి ప్లాస్మా ఇవ్వడం వల్ల ఆయన స్థితిలో ఎలాంటి తేడాలు లేవని తాము గుర్తించామని, అందుకే ప్లాస్మా వాడకాన్ని నిలిపివేశామని రాణా వివరించారు. కరోనా చికిత్సలో రెమ్‌డెసివిర్‌కు సంబంధించి ఆధారాలు లేవని, పని చేయని మందులను నిలిపివేయాలని డాక్టర్ రాణా సూచించారు. కరోనా చికిత్సలో పనితీరుకు సంబంధించి ఆధారాలు లేని మందులను త్వరలో తొలగిస్తారని ఆయన వెల్లడించారు.

కోవిడ్‌ చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని కేంద్ర ప్రభుత్వం సోమవారం(మే 17,2021) తొలగించిన సంగతి తెలిసిందే. కరోనా రోగుల్లో పరిస్థితి విషమించకుండా ప్లాస్మా థెరపీ నిరోధించలేకపోతోందని, మరణాలను నిలువరించలేకపోతుందని తేలిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా బారినపడి కోలుకున్న రోగుల్లో సహజసిద్ధమైన యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయి. అలాంటి వారు ప్లాస్మా దానం చేస్తే (వారి రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేస్తారు) దాన్ని కరోనా రోగికి ఎక్కిస్తారు. యాంటీబాడీలు కరోనా వైరస్‌పై పోరాడటంలో రోగికి ఉపకరిస్తాయనే ఉద్దేశంతో లక్షణాలు కనపడిన వారం రోజుల్లోగా, వ్యాధి తీవ్రత అంతగా లేనపుడు ప్లాస్మా థెరపీని వాడటానికి గతంలో అనుమతించారు.

అయితే.. అశాస్త్రీయంగా, అహేతుకంగా ప్లాస్మా థెరపీని విచ్చలవిడిగా వాడుతున్నారని, దీనివల్ల కలిగే ప్రయోజనాలకు సరైన ఆధారాలు లేవని కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా ప్లాస్మా థెరపీతో ప్రమాదకరమైన కొత్త వేరియెంట్లు పుట్టుకొచ్చే అవకాశముందని హెచ్చరిస్తూ ప్రధాన సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్, ఐసీఎంఆర్‌ చీఫ్‌ భార్గవ ఎయిమ్స్‌ డైరెక్టర్‌కు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన భారత వైద్య పరిశోధన మండలి-కోవిడ్‌ జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ప్లాస్మా థెరపీని చికిత్సా విధానం నుంచి తప్పించాలని సభ్యులందరూ అభిప్రాయపడటం తెలిసిందే.