Dr Anthony Fauci : వ్యాక్సిన్‌ వ్యవధి పెంపుకి ఆంటోనీ ఫౌసీ మద్దతు

భారత్‌లో కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్‌ను పెంచడాన్ని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణులు, వైట్‌ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ అంథోని ఫాసీ సమర్ధించారు.

Dr Anthony Fauci : వ్యాక్సిన్‌ వ్యవధి పెంపుకి ఆంటోనీ ఫౌసీ మద్దతు

Dr Anthony Fauci

Covishield Dose Gap : భారత్‌లో కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్‌ను పెంచడాన్ని అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణులు, వైట్‌ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ అంథోని ఫాసీ సమర్ధించారు. యావత్‌ దేశం వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటున్న సమయంలో ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని… ఫౌసీ తెలిపారు.

రెండు డోసుల మధ్య 12-16 వారాల పాటు గ్యాప్ పెంచడాన్ని కప్పించుకునే వ్యవహారంగా తాను చూడడం లేదని ఫౌసీ స్పష్టం చేశారు.
మరోవైపు వ్యాక్సిన్ డోసుల మధ్య విరామ కాలాన్ని ప్రస్తుతమున్న 6 నుంచి 8 వారాల నుంచి.. 12 నుంచి 16 వారాలకు పెంచడం మంచి నిర్ణయమన్నారు పూనావాలా. టీకా సామర్థ్యాన్ని, రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందని, ఈ నిర్ణయం శాస్త్రీయంగా సరైందేనన్నారు.

కోవీషీల్డ్ సహా పలు వ్యాక్సిన్లను 12 వారాల గ్యాప్‌లో రెండో డోసు ఇవ్వడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతున్నట్లు గతంలో WHO చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా చెప్పారు. లాన్సెట్ మెడికల్ జర్నల్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. రెండో డోసుకు 12 వారాల గ్యాప్ ఇవ్వడం ద్వారా వ్యాక్సిన్ 81శాతం మెరుగ్గా పనిచేస్తున్నట్లు తెలిపింది. అదే కేవలం ఆరు వారాల గ్యాప్‌తో వ్యాక్సిన్ రెండో డోసు ఇస్తే దాని సమర్థత కేవలం 55శాతం మేరకే ఉంటుందని వెల్లడించింది.

Read More :  YCP MP : వైసీపీ ఎంపీ రఘురామ అరెస్టు..ఏ సెక్షన్ల కింద అరెస్టు చేశారు ? ఆ సెక్షన్లు ఏమి చెబుతున్నాయి