Hair Loss Treatment Drug : బట్టతల మహిళలకు శుభవార్త..నివారణకు మెడిసిన్ వచ్చేసింది..

జట్టు రాలిపోతోందని బాధపడుతున్నారా?జుట్టు రాలి రాలి బట్టతల వచ్చేస్తుందని భయపడతున్నారా?నో ప్రాబ్లమ్. జుట్టు రాలే సమ్యను నివారించటానికి బట్టతల నివారణ కోసం ఓ మెడిసిన్ వచ్చేసింది..

Hair Loss Treatment Drug : బట్టతల మహిళలకు శుభవార్త..నివారణకు మెడిసిన్ వచ్చేసింది..

Female Pattern Hair Loss

hair loss treatment drug for women : జట్టు రాలిపోతోందని బాధపడుతున్నారా?నో ప్రాబ్లమ్..జుట్టు రాలి రాలి బట్టతల వచ్చేస్తుందని భయపడతున్నారా?నో ప్రాబ్లమ్. రాలిపోయిన జుట్టు తిరిగి వస్తుంది..ఒత్తైన కురులతో సంబరపడిపోవచ్చు అంటోంది ఓ మెడిసిన్. ఇక బట్టతలపై ఒత్తుగా నల్లని కురులు మీ సొంతం అంటోంది ఓ ఔషధం.బట్టతలను మాయం చేసి ఒత్తైన జుట్టునిచ్చే ఆ మందు ఏమిటో తెలుసుకోవాలని తెగ ఉత్సాపడుతున్నారా? అయితే అదేమిటో తెలుసుకుందాం..

బట్టతల అనగానే ఠక్కునమని గుర్తుకొస్తారు మగవారు. కానీ నేటి కాలంలో అటువంటి సమస్య మహిళలకూ కూడా వస్తోంది. ఒకప్పుడు ఒత్తైన బారెడు కురులతో సోయగాలు పోయే భామలు ఇప్పుడు కొత్తమీర కట్టలాంటి జుట్టుతో విలవిల్లాడిపోతున్నారు. బట్టతల అనేది మహిళలకు పెద్ద తలనొప్పిలా తయారయ్యింది. మహిళల్లో బట్టతలకు పరిష్కారమే లేదా? అంటే ఉంది అంటున్నారు ‘డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్’నిపుణులు.

మహిళల్లో పెరుగుతున్న జుట్టు రాలుడు సమస్యలకు చక్కటి పరిష్కారం అంటున్నారు డాక్టర్లు. అదే “మినోగ్జిడిల్‌’ మెడిసిన్.ఇది జుట్టు రాలుడు సమస్యను అధిగమించేలా చేయటమే కాదు..రాలిపోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు మొలుస్తుంది అంటున్నారు. మినోక్సిడిల్‌ ఇప్పుడు కనుగొన్న మందు కాదు. ఎప్పటి నుంచో ఈ డ్రగ్‌ వాడుకలో ఉంది. స్త్రీల్లో బట్టతల నివారణకు ఉద్దేశించిన ఈ డ్రగ్‌ అత్యంత సురక్షితం అని చెబుతున్నారు డాక్టర్లు.

“మినోగ్జిడిల్‌’ అనే ఔషధాన్ని మినోటాప్‌ 2 శాతం, మినోటాప్‌ ఎవా 5 శాతం, అనే బ్రాండు పేర్లతో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీన్ని ఎఫ్‌పీహెచ్‌ఎల్‌ మహిళల్లో జుట్టు రాలే సమస్యను నివారించే చికిత్సకోసం సిఫారసు చేస్తున్నారు. మగవారిలో బట్టతల నివారణకు ఈ సొల్యూషన్‌కి అనుమతి ఉంది. అయితే దీన్ని మహిళలకు వినియోగించేందుకు అనుమతివ్వడం ఇదే తొలిసారి.

Read more : Bald-Fest’ : బ‌ట్ట‌త‌ల ఉంటేనే ఆ ఫెస్ట్ కు ఎంట్రీ.. 

ఈ డ్రగ్‌ని హృదయ సంబంధిత జబ్బులకీ, రక్తపోటు తగ్గించడానికీ వాడుతున్నారు. దీన్ని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అప్రూవ్‌ కూడా చేసింది. 2 శాతం మినోక్సిడల్‌ ఉపయోగిస్తున్న పురుషుల్లో జుట్టుపెరగడం గుర్తించారు మెడికల్ స్పెషలిస్టులు. ఆ తర్వాత నుంచి హెయిర్‌ ట్రీట్మెంట్‌కి దీన్ని వాడటం మొదలుపెట్టారు.

ఈక్రమంలో తాజాగా రెడ్డీస్‌ ల్యాబ్‌ మహిళల కోసం కూడా టాపికల్‌ సొల్యూషన్‌ వేరియంట్‌ని కొత్తగా తీసుకొచ్చింది. అయితే దీని వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉంది. కనుక నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి అని సూచిస్తున్నారు.

ఆడవాళ్ళైనా, మగవాళ్ళకైనా జుట్టు రాలే సమస్యకు ఎన్నో కారణాలున్నాయి.ఒత్తిడి, మానసిక సమస్యలు, మారుతున్న జీవన శైలి, తినే ఆహారం, జుట్టుకి వేసుకునే రకరకాల రంగుల్లో ఉండే కెమికల్స్‌, అలాగే వాడే షాంపులు ఇవన్నీ జుట్టుపై ప్రభావం చూపుతాయి. దీంతో జుట్టు రాలుడు సమస్య పెరుగుతోంది. ఈ మందు వాడిన వాళ్ళు మాత్రం జుట్టు రాలే సమస్యకు ఈ డ్రగ్‌ బాగా పనిచేస్తుందంటున్నారు.ఈ మెడిసిన్ ను అప్లై చేయడం వల్ల న్యూట్రిషన్‌ వ్యాల్యూస్‌ జుట్టుకుదుళ్ళ నుంచి జుట్టుకి అందుతాయి. దీంతో జుట్టు రాలే సమస్యను అధిగమించవచ్చునంటున్నారు.