Dr YSR Horticultural University : డా. వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్శిటీలో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు

దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.1,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 20న కౌన్సిలింగ్ ఉంటుంది.

Dr YSR Horticultural University : డా. వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్శిటీలో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు

Ysr Horticulture

Dr YSR Horticultural University : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని డా.వైఎస్సార్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

ఎమ్మెస్సీ (హార్టికల్చర్‌) ; ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. నాలుగేళ్ల బీఎస్సీ హార్టికల్చర్‌, బీఎస్సీ ఆనర్స్‌ హార్టికల్చర్‌ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తుకు అర్హులు. పది పాయింట్ల స్కేల్‌ మీద కనీసం 5.5 ఓజీపీఏ తప్పనిసరి. అభ్యర్థుల వయసు జూలై 1 నాటికి 40 ఏళ్లు మించకూడదు. ఐకార్‌ ఏఐఈఈఏ పీజీ 2021 అర్హత పొంది ఉండాలి.

మొత్తం 57 సీట్లు ఉన్నాయి. విభాగాల వారిగా సీట్ల వివరాలను పరిశీలిస్తే ఫ్రూట్‌ సైన్స్‌ 9, వెజిటబుల్‌ సైన్స్‌ 11, ఫ్లోరి కల్చర్‌ అండ్‌ లాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చర్‌ 8, ప్లాంటేషన్‌ – స్పైసెస్‌ – మెడిసినల్‌ – అరోమాటిక్‌ క్రాప్స్‌ 6, పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ 6, ప్లాంట్‌ పాథాలజీ 4, ఎంటమాలజీ 4 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యుఎస్‌ సీట్లు 5, ఇతర రాష్ట్రాల అభ్యర్థుల కోసం 4 సీట్లు ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్, బీసీ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 18న కౌన్సిలింగ్ ఉంటుంది.

పీహెచ్‌డీ (హార్టికల్చర్‌); ఈ కోర్సుకు సంబంధించి ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. హార్టికల్చర్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసినవారు అప్లయ్‌ చేసుకోవచ్చు. పది పాయింట్ల స్కేల్‌ మీద కనీసం 6.5 ఓజీపీఏ తప్పనిసరి. అభ్యర్థుల వయసు జూలై 1 నాటికి 47 ఏళ్లు మించకూడదు. ఐకార్‌ ఏఐసీఈ జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ పీహెచ్‌డీ 2021 అర్హత పొంది ఉండాలి.

మొత్తం 24 సీట్లు ఉన్నాయి. విభాగాల వారీగా పరిశీలిస్తే ఫ్రూట్‌ సైన్స్‌, వెజిటబుల్‌ సైన్స్‌, ఫ్లోరికల్చర్‌ అండ్‌ లాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్చర్‌, ప్లాంటేషన్‌ , స్పయిసెస్‌ , మెడిసినల్‌ , అరోమాటిక్‌ క్రాప్స్‌ విభాగాల్లో ఒక్కోదానిలో 4, పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ, ప్లాంట్‌ పాథాలజీ, ఎంటమాలజీ విభాగాల్లో ఒక్కోదానిలో 2 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యుఎస్‌ 2సీట్లు ఉన్నాయి.

దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.1,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 20న కౌన్సిలింగ్ ఉంటుంది.

దరఖాస్తులను అందజేసేందుకు డిసెంబరు 13 ఆఖరు తేదిగా నిర్ణయించారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియను సెమినార్‌ హాల్‌, కాలేజ్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌, వెంకటరామన్నగూడెంలో నిర్వహిస్తారు. దరఖాస్తు పంపాల్సిన చిరునామా రిజిస్ట్రార్‌, డా.వైఎస్సార్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌, పోస్ట్‌ బాక్స్‌ నెం.7, వెంకటరామన్నగూడెం, తాడేపల్లిగూడెం – 534101, పశ్చిమగోదావరి జిల్లా. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: drysrhu.ap.gov.inను సంప్రదించగలరు.