పైలెట్ లేని ఎయిర్ క్రాఫ్ట్ : అభ్యాస్ టెస్ట్ విజయవంతం

  • Published By: venkaiahnaidu ,Published On : May 14, 2019 / 04:39 AM IST
పైలెట్ లేని ఎయిర్ క్రాఫ్ట్ : అభ్యాస్ టెస్ట్ విజయవంతం

అభ్యాస్‌–హైస్పీడ్‌ ఎక్స్‌పాండబుల్‌ ఏరియల్‌ టార్గెట్‌(HEAT) అనే డ్రోన్‌ ను భారత్‌ సోమవారం(మే-13,2019) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్‌ లో ని ఇంటర్మ్ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ఈ పరీక్షను DRDO విజయవంతంగా నిర్వహించింది. ఈ పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆటోపైలట్‌ వ్యవస్థ సాయంతో ముందుకు దూసుకెళుతుంది. ఇందులో చిన్న గ్యాస్‌ టర్బైన్‌ ఇంజిన్లతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన ఎంఈఎంఎస్‌ నేవిగేషన్‌ వ్యవస్థను డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు వినియోగించారు. ఈ ప్రయోగంలో అభ్యాస్‌ నిర్దేశిత ప్రమాణాలన్నింటిని అందుకుందని డీఆర్‌డీవో వర్గాలు తెలిపాయి.