ఎర్రకోటపై మోడీ..మరీ, ఈ పరికరం ఏంటీ ?

  • Published By: madhu ,Published On : August 15, 2020 / 01:40 PM IST
ఎర్రకోటపై మోడీ..మరీ, ఈ పరికరం ఏంటీ ?

దేశ వ్యాప్తంగా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ వేడుకలు జరిగాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండాను ఆవిష్కరించడం మోడీకి ఇది ఏడోసారి.



ఈ కార్యక్రమాన్ని కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించారు. కొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. పరిమిత సంఖ్యలో ప్రజలకు అనుమతినిచ్చారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..వేడుకలు జరిగాయి. అయితే..ఎర్రకోట దగ్గర ఉంచిన ఓ పరికరంపై అందరి ఫోకస్ నెలకొంది. అసలు అక్కడ ఎందుకు పెట్టారు ? బ్లాక్ కలర్ లో ఉన్న ఆ వస్తువు ఏంటీ అని తెగ చర్చించుకున్నారు.

ఆ పరికరం పేరు యాంట్రీ డ్రోన్ సిస్టమ్ (anti-drone system) దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) రూపొందించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా…భద్రత కోసం సమీపంలో దీనిని ఏర్పాటు చేశారు.



సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉండే మైక్రో డ్రోన్లను డిటెక్ట్ చేసి వాటిని పని చేయకుండా జామ్ చేయవచ్చు. అలాగే 1 నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాన్ని లేజర్ సహాయంతో పేల్చేయవచ్చు.

అయితే..ఇలాంటి పరికరాలను ఆర్మీ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. శత్రు దేశాలకు చెందిన డ్రోన్ల కదలికలను తెలుసుకుని వాటిని పేల్చేస్తారు.