‘Drink alcohol, Eat Gutka’..BJP MP : మద్యం తాగండీ, గుట్కా నమలండీ : బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

మద్యం తాగండీ..గుట్కా నమలాలని, థిన్నర్ ను పీల్చండీ అంటూ బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘Drink alcohol, Eat Gutka’..BJP MP : మద్యం తాగండీ, గుట్కా నమలండీ : బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

‘Drink alcohol, Eat Gutka’ BJP MP Janardhan Mishra comments

‘Drink alcohol, Eat Gutka’ BJP MP Janardhan Mishra comments : బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఎవరైనా మద్యం తాగేవారిని..మత్తు పదార్ధాలకు అలవాటుపడినవారిని వాటిని మానుకోవాలని..ఆరోగ్యంగా ఉండాలని చెబుతుంటారు. కానీ బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రామాత్రం ప్రజలకు మద్యం తాగండీ..గుట్కా తినండీ అంటూ పిలుపు ఇచ్చారు. మధ్యప్రదేశ్ లోని రేవాలో కృష్ణరాజ్ కపూర్ ఆడిటోరియంలో నీటి పరిరక్షణపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఎంపీ మిశ్రా నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెబుతూ..విచిత్రంగా మద్యం తాగండీ..గుట్కా నమలాలని, థిన్నర్ ను పీల్చండీ..కానీ నీటిని పరిరక్షించండీ..జాగ్రత్తగా వినియోగించండీ అంటూ వ్యాఖ్యానించారు. నీటిని పరిరక్షించటానికి మద్యం తాగటానికి గుట్కా పీల్చటానికి సంబంధం ఏంటో జనాలకు అర్థం కాలేదు. మరి ఏ ఉద్ధేశ్యంతో ఎంపీగారు ఈ వ్యాఖ్యలు చేశారో ప్రజలకు అర్థం కాలేదు..బహుశా ఆ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా వారికి కూడా అర్థం అయి ఉండకపోవచ్చు..

నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయని..వాటిని రక్షించాలని సూచించారు ఎంపీ. ఇదంతా బాగానే ఉంది. నీటి పరిరక్షించాలని చెప్పటంతో పాటు గుట్కా నమలండి, మద్యం తాగండి, థిన్నర్‌ను పీల్చండి అంటూ చెప్పుకొచ్చేసరికి అంతా షాక్ అయ్యారు. అక్కడితో ఆగని ఎంపీ మిశ్రా… సులేసాన్ (ఒక రకమైన జిగురులాంటి పదార్థం) లేదంటే ఐయోడెక్స్ తినండి. కానీ..నీళ్ల ప్రాముఖ్యతను మాత్రం అర్థం చేసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఏదైనా ప్రభుత్వం నీటి పన్నులు మాఫీ చేస్తామని చెబితే నీటి పన్నులను తాము చెల్లిస్తామని, కరెంటు బిల్లులు సహా ఇతర పన్నులను మాఫీ చెయ్యాలని కోరాలని జనార్దన్ మిశ్రా ప్రజలను కోరారు. కాగా ఎంపీ మిశ్రా ఇటువంటి వింత విచిత్ర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కటం ఇది మొదటిసారికాదు. ఇటీవల ఆయన ఉత్త చేతులతో టాయిలెట్‌ను శుభ్రం చేసిన వీడియో వైరల్ అయింది. వార్తల్లో ఉండాలని ఇటువంటి వ్యాఖ్యలు..పనులు చేస్తుంటారో ఏమో అనిపిస్తుంటుంది మిశ్రాతీరు.