Railway Staff Saves Senior Citizen : ట్రైన్ కి ఎమర్జెన్సీ బ్రేక్..దక్కిన వృద్ధుడి ప్రాణం

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కల్యాణ్​ స్టేషన్ వద్ద ఓ రైలు డ్రైవర్​ చాకచక్యం కారణంగా వృద్ధుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది.

Railway Staff Saves Senior Citizen : ట్రైన్ కి ఎమర్జెన్సీ బ్రేక్..దక్కిన వృద్ధుడి ప్రాణం

Train

Railway Staff Saves Senior Citizen మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కల్యాణ్​ స్టేషన్ వద్ద ఓ రైలు డ్రైవర్​ చాకచక్యం కారణంగా వృద్ధుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆదివారం మధ్యాహ్నాం 12:45గంటల సమయంలో కల్యాణ్ స్టేషన్ లోని ఫ్లాట్ ఫాం నెం.4 నుంచి ముంబై-వారణాశి రైలు స్టార్ట్ అయ్యింది. అయితే ఇదే సమయంలో హరి శంకర్​ అనే 70ఏళ్ల వృద్ధుడు లోకోమోటివ్​ రైలు ట్రాక్​ను దాటుతున్న సమయంలో కింద పడిపోయాడు.

అయితే ఇది గమనించిన చీఫ్ పర్మెనెంట్ వే ఇన్స్ పెక్టర్(CPWI)సంతోష్ కుమార్..వెంటనే రైలు ఆపమని లోకోపైలట్లకు సిగ్నల్​ ఇచ్చారు. దీంతో వెంటనే లోకోపైలట్లు అత్యవసర బ్రేకులు వేశారు. అయితే అప్పటికే రైలుముందుభాగం కింద ఇరుక్కున్నాడు హరిశంకర్. వెంటనే రైలు దిగిన లోకోపైలట్​ ఎస్​కే ప్రధాన్​, అసిస్టెంట్​ పైలట్​ రవిశంకర్..రైలు ముందుభాగంలో ఇరుక్కున్న బాధితుడిని బయటకు తీశారు.

కాగా,అత్యవసర బ్రేకులు వేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ఇద్దరు లోకో పైలట్లకు,CPWIకి ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున నగదు బహుమతిని ప్రకటించారు సెంట్రల్ రైల్వేస్ జనరల్ మేనేజర్ అలోక్ కన్సాల్.