Drones spotted: అంబాలా ఎయిర్ బేస్‌లో డ్రోన్ల కలకలం.. రెండు రోజులు చక్కర్లుకొట్టిన వైనం

హరియాణాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో డ్రోన్లు కలకలం రేపాయి. ఆగస్టు 13, 15 తేదీల్లో ఆ ప్రాంతంలో డ్రోన్లు కనపడ్డాయని భారతీయ వైమానిక దళ సిబ్బంది అంబాలా కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. గగనతలంలో ఎరుపు రంగు డ్రోనుతో పాటు మరో వస్తువు కనపడినట్లు ఐఏఎఫ్ సిబ్బంది ఫిర్యాదు చేశారని పోలీసులు మీడియాకు తెలిపారు.

Drones spotted: అంబాలా ఎయిర్ బేస్‌లో డ్రోన్ల కలకలం.. రెండు రోజులు చక్కర్లుకొట్టిన వైనం

Pakistani drone

Drones spotted: హరియాణాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో డ్రోన్లు కలకలం రేపాయి. ఆగస్టు 13, 15 తేదీల్లో ఆ ప్రాంతంలో డ్రోన్లు కనపడ్డాయని భారతీయ వైమానిక దళ సిబ్బంది అంబాలా కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. గగనతలంలో ఎరుపు రంగు డ్రోనుతో పాటు మరో వస్తువు కనపడినట్లు ఐఏఎఫ్ సిబ్బంది ఫిర్యాదు చేశారని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అనధికార డ్రోన్లు కనపడుతూ కలకలం రేపుతున్నాయి.

రాజస్థాన్ లోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంలో గత నెల 26న అర్ధరాత్రి ఓ డ్రోను తిరిగిందని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది. అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు (ఐబీ) వ‌ద్ద గ‌గ‌న‌తలంలో డ్రోన్లు పంపుతూ పాక్ చాలా కాలంగా దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న విషయం తెలిసిందే. డ్రోన్లు కనడితే బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి కాల్పులు జ‌రుపుతున్నారు. పాక్ ప‌దేప‌దే డ్రోన్లు పంపుతుండడంతో భార‌త సైన్యం నిఘా ఉంచింది. భారత గగనతలం వైపుగా వచ్చే డ్రోన్ల‌ను కుప్ప‌కూల్చుతోంది.

Lok Sabha Polls 2024: బిహార్‌లో 35 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ