Drug Case : ఏడుస్తున్న ఆర్యన్, ఫోన్ చేసిన షారూక్..చట్టం ఏం చెబుతోంది ?

విచారణ సమయంలో ఆర్యన్ ఏడుస్తూనే ఉన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో..షారూక్ ఖాన్..కొడుకు ఆర్యన్ తో మాట్లాడారు. కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు.

Drug Case : ఏడుస్తున్న ఆర్యన్, ఫోన్ చేసిన షారూక్..చట్టం ఏం చెబుతోంది ?

Srk Son

Shahrukh call To Aryan Khan : బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీ కేసులో ఎన్సీబీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న బాలీవుడ్ బాద్ షా షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ ప్రస్తుతం ఎన్సీబీ కస్టడీలో ఉన్నారు. ఆదివారం రాత్రి అతనితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు.. షిప్‌లో రేవ్‌ పార్టీ, డ్రగ్స్‌పై విచారణ జరుపుతున్నారు. రేవ్ పార్టీ ఎవరు జరిపించారు? డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఎన్సీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం సాయంత్రం వరకు విచారించి.. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విచారణ సమయంలో ఆర్యన్ ఏడుస్తూనే ఉన్నాడని తెలుస్తోంది. ఈ క్రమంలో..షారూక్ ఖాన్..కొడుకు ఆర్యన్ తో మాట్లాడారు. కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఎన్ సీబీకి ఆర్యన్ చెప్పినట్లు సమాచారం. విదేశాల్లో కూడా ఇతను డ్రగ్స్ తీసుకొనే వాడని ఎన్ సీబీ అంటోంది.

Read More : Byju AD : షారుక్ ఖాన్ కు కష్టాలు తప్పవా ? ఆ యాడ్ నుంచి తొలగిస్తారా ?

డ్రగ్స్ చట్టం ఏం చెబుతోంది :-

1985 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ లోని 8(సి) సెక్షన్ కింద ఆర్యన్ ను అరెస్టు చేసినట్లు ఎన్సీబీ తెలిపింది. మాదక ద్రవ్యాలను ఉత్పత్తి చేసినా, తయారు చేసినా, కలిగి ఉన్నా, విక్రయించినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా, నిల్వ చేసినా, వినియోగించినా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్టానికి దిగుమతి చేసినా, ఎగుమతి చేసినా, దేశం నుంచి బయటికి ఎగుమతి చేసినా, బయటి నుంచి దేశంలోకి దిగుమతి చేసినా అది శిక్షార్హమైన నేరమని ఈ చట్టం స్పష్టం చేస్తోంది.

Read More : SRK’s Son Aryan : క్రూయిజ్ డ్రగ్స్ కేసు, ఆర్యన్ ఖాన్‌‌కు బెయిల్ వస్తుందా ?

ఆరు నెలల వరకు కఠిన కారాగారా శిక్ష : –
ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారికి ఆరు నెలల వరకూ కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక క్రూయిజ్ పైన ఎన్ సీబీ అధికారులు చేసిన దాడిలో 13 గ్రాముల కొకైన్, అయిదు గ్రామలు ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ, లక్షా 33వేల నగదు దొరికినట్టు అధికారులు కోర్టులో చెప్పారు. పట్టుపడిన డ్రగ్స్ విలువ 5 కోట్ల వరకూ ఉంటుంది. 1985 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ ఎన్‌డీపీఎస్ సెక్షన్ 8(సి), 20 (బి), 27, 35 సెక్షన్ల కింద ఆర్యన్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే.. ఆరు నెలల వరకు కఠిన జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇక NDPS యాక్ట్ సెక్షన్ 20(బి) ప్రకారం గంజాయిని కలిగి ఉండటం శిక్షార్హమైన నేరం. నిబంధనలకు విరుద్ధంగా గంజాయి రవాణా చేయడం నేరం. గంజాయి వాడితే పదేళ్ల వరకు పొడిగించే కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు. NDPS యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం మత్తుమందు తీసుకోవడం నేరం. ఏడాది వరకు జైలు శిక్ష, రూ. 20,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.