కేరళ తీరంలో కలకలం..మూడు చేపల బోట్లలో 3వేల కోట్ల విలువైన డ్రగ్స్, ఏకే-47 తుపాకులు

కేరళ తీరంలో తీవ్ర కలకలం రేగింది. శ్రీలంక నుంచి అరేబియా సముద్రం మీదుగా భారత్‌లోకి భారీగా డ్రగ్స్, పేలుడు పదార్థాలు,తుపాకులను తరలిస్తున్న ముఠాను కోస్ట్ గార్డ్ సిబ్బంది అరెస్ట్ చేసింది.

కేరళ తీరంలో కలకలం..మూడు చేపల బోట్లలో 3వేల కోట్ల విలువైన డ్రగ్స్, ఏకే-47 తుపాకులు

Drugs And Arms Seized From Sri Lankan Boats1

kerala కేరళ తీరంలో తీవ్ర కలకలం రేగింది. శ్రీలంక నుంచి అరేబియా సముద్రం మీదుగా మూడు బోట్లలో భారత్‌లోకి భారీగా డ్రగ్స్,పేలుడు పదార్థాలు,తుపాకులను తరలిస్తున్న ముఠాను కోస్ట్ గార్డ్ సిబ్బంది అరెస్ట్ చేసింది. మార్చి 18న ఈ ఘటన జరగగా..దానికి సంబంధించిన వివరాలను ఇండియన్ కోస్ట్ గార్డ్(ICG) అధికారులు ఇవాళ మీడియాకు వెల్లడించారు.

మార్చి 18న ఎప్పటిలానే కోస్ట్ గార్డ్ సిబ్బంది అరేబియా సముద్రంలో గస్తీకి వెళ్లారు. ఈ సమయంలో మినికాయ్ ద్వీపం సమీపంలో మూడు మత్స్యకారుల బోట్లు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో కోస్ట్‌గార్డ్ సిబ్బంది వాటిని వెంబడించారు. కోస్ట్ గార్డ్స్‌ను చూసి వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ వారిని వెంటాడి ఎట్టకేలకు పట్టుకున్నారు. బోటు లోపలికి వెళ్లి చూసిన కోస్ట్ గార్డ్ సిబ్బంది షాక్ అయ్యారు. బోటుల నిండా మాదక ద్రవ్యాలే ఉన్నాయి. మొత్తం మూడు శ్రీలంకకు చెందిన ఫిషింగ్ బోట్ల నుంచి 300 కేజీల హెరాయిన్, 5 ఏకే-47 తుపాకులు, 1000 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లోర రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మొత్తం మూడు బోట్లను సీజ్ చేసి అత్యంత భద్రత నడుమ కేరళలోని వింజింజామ్ తీరానికి తీసుకొచ్చారు. మూడు బోట్లలోని 19మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) దర్యాప్తు చేస్తోంది.