Aryan Khan : డ్రగ్స్ కేసు.. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు బిగుస్తున్న ఉచ్చు

డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కైన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. మరోసారి కోర్టును ఆర్యన్ ఖాన్ కస్టడీని కోరనుంది ఎన్సీబీ(నార్కోటిక్స్

Aryan Khan : డ్రగ్స్ కేసు.. షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్‌కు బిగుస్తున్న ఉచ్చు

Aryan Khan

Aryan Khan : డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కైన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుస్తోంది. మరోసారి కోర్టును ఆర్యన్ ఖాన్ కస్టడీని కోరనుంది ఎన్సీబీ(నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో). కస్టడీలో లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని, రైడ్ లో లభించిన డ్రగ్స్ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు ఎన్సీబీ అధికారులు. ఇక ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానిస్తున్న శ్రేయస్ నాయర్ అనే వ్యక్తిని ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. ఆర్యన్ ఖాన్, అర్బాజ్ లకు డ్రగ్స్ సప్లయ్ చేసింది శ్రేయస్ నాయర్ అని ఎన్సీబీ గుర్తించింది.

Covid Victims : మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే..కోవిడ్‌‌తో చనిపోయిన ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదు

వారి మధ్య జరిగిన చాటింగ్ ఆధారంగా శ్రేయస్ నాయర్ పాత్ర వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురికి పార్టీల్లో పరిచయం ఏర్పడిందని, ఈ ముగ్గూరు కలిసి గతంలో అనేక పార్టీలు చేసుకున్నారని ఎన్సీబీ దర్యాఫ్తులో తేలింది. మరోవైపు క్రూయిజ్ షిప్ లో ఎన్సీబీ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు. తాజా సోదాల్లో మళ్లీ డ్రగ్స్ లభ్యమయ్యాయి. మరో 8మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్యన్ ను ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్న ఎన్సీబీ.. ఆర్యన్ డ్రగ్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నాడు? ఎవరు సరఫరా చేస్తున్నారు అనే విషయాలపై పూర్తిగా దృష్టి పెట్టి కొంత సమాచారం తెలుసుకుంది.

Flubot Malware : సెక్యూరిటీ అప్‌డేట్ అని మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే

నాలుగేళ్లుగా డ్రగ్స్ కు బానిస..
విచారణ సమయంలో నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆర్యన్ ఎన్సీబీకి చెప్పినట్లు తెలుస్తోంది. యూకే, దుబాయ్ సహా ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్ తీసుకునే వాడని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. ఎన్సీబీ విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్ ఏడుస్తూనే ఉన్నాడని అధికారులు చెబుతున్నారు. వైద్య పరీక్షల కోసం ఆర్యన్ ను ఆసుపత్రికి తరలించిన అధికారులు అక్కడి నుంచి మళ్లీ ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇవాళ్టితో కస్టడీ ముగుస్తుండటంతో ఆర్యన్ ను సాయంత్రంలోగా కోర్టులో హాజరుపరిచి మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ఆర్యన్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్‌ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న ఎన్‌సీబీ అధికారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అక్కడ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్య‌న్ ఖాన్‌తోపాటు 8మందిని ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా అంతా ప్రముఖుల పిల్లలే. కార్డెలియా క్రూయిజ్ షిప్‌లో ఈ రేవ్ పార్టీ జ‌రిగింది. శ‌నివారం రాత్రి ఈ దాడులు జ‌ర‌గ‌గా.. ఆదివారం ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ ఆర్య‌న్‌ను ఎన్సీబీ ప్ర‌శ్నించింది. సాయంత్రం అత‌న్ని అరెస్ట్ చేసింది. ఆదివారం ఆర్య‌న్‌, అర్బాన్‌, మున్మున్‌ల‌ను మెట్రోపాలిట‌న్ మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌ర‌చ‌గా.. సోమ‌వారం వ‌ర‌కూ వాళ్ల‌కు ఎన్సీబీ క‌స్ట‌డీ విధించారు. ఆర్య‌న్‌పై సెక్ష‌న్ 27 (నార్కోటిక్ డ్ర‌గ్ వినియోగించినందుకు శిక్ష‌), 8సీ (డ్ర‌గ్స్ త‌యారీ, ఉత్ప‌త్తి, క‌లిగి ఉండ‌టం, అమ్మ‌డం లేదా కొన‌డం)తోపాటు ఇత‌ర నార్కోటిక్స్ డ్ర‌గ్స్ అండ్ సైకోట్రాపిక్ స‌బ్‌స్టాన్సెస్ చ‌ట్టంలోని సంబంధిత సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు.