Madhya Pradesh: మద్యం మత్తులో యూనిఫామ్ తీసేసిన పోలీస్… వీడియో వైరల్ కావడంతో సస్పెండ్ చేసిన అధికారులు

సుశీల్‌కు మద్యం సేవించే అలవాటు ఉంది. గతంలో కూడా పలుసార్లు మద్యం సేవించి, ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా శుక్రవారం సాయంత్రం బాగా మద్యం తాగిన సుశీల్ మత్తులో విచ్చలవిడిగా ప్రవర్తించాడు.

Madhya Pradesh: మద్యం మత్తులో యూనిఫామ్ తీసేసిన పోలీస్… వీడియో వైరల్ కావడంతో సస్పెండ్ చేసిన అధికారులు

Madhya Pradesh: బాధ్యతగా ప్రవర్తిస్తూ, శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన ఒక పోలీస్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఒంటిపై యూనిఫామ్ తీసేసి, విచ్చలవిడిగా ప్రవర్తించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్, హర్దా జిల్లాలో జరిగింది. సుశీల్ మాండవి అనే కానిస్టేబుల్ హర్దా జిల్లాలోని పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.

Chanda Kochhar: అక్రమ రుణ మంజూరు కేసులో ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచ్చర్ దంపతుల అరెస్ట్

సుశీల్‌కు మద్యం సేవించే అలవాటు ఉంది. గతంలో కూడా పలుసార్లు మద్యం సేవించి, ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా శుక్రవారం సాయంత్రం బాగా మద్యం తాగిన సుశీల్ మత్తులో విచ్చలవిడిగా ప్రవర్తించాడు. రోడ్డుపై గట్టిగా అరుస్తూ, స్థానికులతో వీరంగం సృష్టించాడు. ఒంటిపై ఉన్న పోలీస్ యూనిఫాం తీసేశాడు. షర్ట్, ప్యాంట్ రెండూ తీసేసి, చుట్టుపక్కల వాళ్లపై విసిరేశాడు. ఈ విషయంలో చుట్టుపక్కల వాళ్లు అతడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. మద్యం మత్తులో ఉండటంతో వారితోనే వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనను అక్కడి వాళ్లు వీడియో తీశారు. దీంతో ఈ వీడియో అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది పోలీస్ ఉన్నతాధికారుల వద్దకు చేరింది. దీంతో స్పందించిన జిల్లా ఎస్పీ.. సుశీల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సుశీల్ మద్యం తాగి వాహనం నడిపి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అప్పుడు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. అయినప్పటికీ మారని సుశీల్ ఇప్పుడు మరోసారి మద్యం అలవాటుతో ఉద్యోగం పోగొట్టుకున్నాడు.