Drunk woman : దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి.. తాగి మహీంద్రా థార్‌ని నడిపిన అమ్మాయి… బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ

మందుబాబులే కాదు మందు భామలు కూడా తయారయ్యారు. మగాళ్లకు మేమేం తక్కువ అనుకున్నారో ఏమో కానీ, అమ్మాయిలు కూడా పూటుగా తాగి రోడ్డెక్కుతున్నారు. అంతేకాదు మద్యం మత్తులో నడిరోడ్డుపై రచ్చరచ్చ చేస్తున్నారు. పోలీసుల ముందు ఈ అమ్మాయి చేసిన వీరంగం మీరూ చూడండి...

Drunk woman : దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి.. తాగి మహీంద్రా థార్‌ని నడిపిన అమ్మాయి… బూతులు తిడుతూ నడిరోడ్డుపై రచ్చరచ్చ

Drunk Woman In Mahindra Thar

Drunk woman in Mahindra Thar challenges : డ్రంక్ అండ్ డ్రైవింగ్ నేరం అని తెలుసు. శిక్షార్హం అని కూడా తెలుసు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుబడితే జైలుకి పంపిస్తారనీ తెలుసు. అయినా కొందరు వాహనదారులు మారడం లేదు. ఫుల్లుగా మందు కొట్టి వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. ప్రమాదాలకు కారణం అవుతున్నారు. అమాయకులు ప్రాణాలు తీస్తున్నారు. కాగా, మందుబాబులే కాదు మందు భామలు కూడా తయారయ్యారు. మగాళ్లకు మేమేం తక్కువ అనుకున్నారో ఏమో కానీ, వాళ్లు కూడా పూటుగా తాగి రోడ్డెక్కుతున్నారు. అంతేకాదు మద్యం మత్తులో నడిరోడ్డుపై రచ్చరచ్చ చేస్తున్నారు. పోలీసుల ముందే వీరంగం సృష్టిస్తున్నారు.

తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని తిరువల్లూరులో అలాంటి ఘటన ఒకటి జరిగింది. మద్యం మత్తులో ఓ అమ్మాయి రెచ్చిపోయింది. నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేసింది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చెయ్యడమే కాకుండా పోలీసులతో అనుచితంగా ప్రవర్తించింది. ఇంగ్లీష్ లో మాట్లాడుతూ బూతులు తిట్టింది. నేను తప్పు చేసుంటే, మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్యండి అంటూ మగ పోలీసుల మీదమీదకు వెళ్లింది.

ఓ అమ్మాయి ఇటీవలే ట్రైనింగ్ పూర్తి చేసుకుంది. ఆ ఆనందాన్ని తన ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంది. ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్లి అంతా బాగా తిని మందు తాగారు. ఆ తర్వాత అమ్మాయి మహీంద్రా థార్ లో ఇంటికి బయలుదేరింది. మద్యం మత్తులో ఆ అమ్మాయి ర్యాష్ డ్రైవింగ్ చేసింది. ముందువెళ్తున్న వ్యాన్ ని బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్ ని ఆపేసిన డ్రైవర్ కిందకు దిగాడు. ఆ అమ్మాయిని క్వశ్చన్ చేశాడు. అసలే మద్యం మత్తులో ఉన్న అమ్మాయి.. ఆ వ్యాన్ డ్రైవర్ పై చిందులు తొక్కింది. నువ్వే తప్పు చేశావ్ అని ఎదురుదాడికి దిగింది. దీంతో గొడవ పెద్దదైంది. చుట్టూ జనం చేరారు.

ఇంతలో ఈ విషయం పోలీసులకు చేరింది. వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. ఆ అమ్మాయిని చూడగానే పోలీసులకు మ్యాటర్ అర్థమైపోయింది. ఆమె బాగా తాగి ఉందని గ్రహించారు. అసలే తాగుంది, పైగా మహిళ. దీంతో పోలీసులు మౌనంగా ఉండిపోయారు. ఆమెకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా అమ్మాయి వినలేదు. సరికదా, పోలీసులను చూడగానే మరింత రెచ్చిపోయింది. నానా హంగామా చేసింది. నేను తప్పు చేసుంటే, మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్యండి అని పోలీసులను చాలెంజ్ చేసింది. వారిని రెచ్చగొట్టింది. ఆ అమ్మాయి తీరు పోలీసులకు పిచ్చ కోపం తెప్పించింది. కానీ, అమ్మాయి కావడంతో ఏమీ చెయ్యలేకపోయారు.

ఇంతలో స్పాట్ కి ఆ అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చారు. వారు ఆమెకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె కంట్రోల్ కాలేదు. దీంతో ఫ్రెండ్స్ బలవంతంగా ఆమెని మరో కారులో ఇంటికి తీసుకెళ్లిపోయారు. పోలీసులు మహీంద్రా థార్ వాహనాన్ని స్టేషన్ కి పట్టుకెళ్లారు. ఉదయాన్నే అమ్మాయిని, వారి తల్లిదండ్రులను స్టేషన్ కి తీసుకురావాలని అమ్మాయి ఫ్రెండ్స్ తో పోలీసులు చెప్పారు.

కాగా, మహిళా కానిస్టేబుల్ ఉంటేనే.. స్త్రీని అరెస్ట్ చేయొచ్చు. ఒకవేళ పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉంచుకోవాలన్నా.. స్టేషన్ లో కచ్చితంగా మహిళా కానిస్టేబుల్ ఉండాలని రూల్ ఉంది. దీంతో పోలీసులు ఆమెని టచ్ చెయ్యకుండా వదిలేశారు. తెల్లారాక చూసుకుందామని వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమెపై కేసు నమోదు చేశారో లేదో తెలియాల్సి ఉంది.

కాగా, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. అంతేకాదు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఈ రూల్స్ గురించి తెలిసినా కొందరు వాహనదారులు లెక్క చెయ్యడం లేదు. మందు తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారు. కాగా, మద్యం మత్తులో నడిరోడ్డుపై ఆ అమ్మాయి చేసిన రచ్చకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.