దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి : నదిలో 10మంది గల్లంతు

  • Published By: madhu ,Published On : October 9, 2019 / 04:14 AM IST
దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి : నదిలో 10మంది గల్లంతు

రాజస్థాన్‌లోని ధోల్ పూర్‌‌లో దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహం నిమజ్జనం చేస్తుండగా పర్బతి నదిలో 10 మంది గల్లంతయ్యారు.
సమాచారం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. తమ వారు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనపై ధోల్ పూర్ కలెక్టర్ స్పందించారు. అక్టోబర్ 08వ తేదీ మంగళవారం రాత్రి దుర్గాదేవి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వచ్చారని, ప్రమాదవశాత్తు 10 మంది నీటిలో మునిగిపోయారన్నారు. సమాచారం తెలిసిన వెంటనే వారికోసం గాలింపు చేపట్టామని, కానీ రాత్రి కావడంతో సెర్చ్ ఆపరేషన్లు నిలిపివేసినట్లు తెలిపారు. తిరిగి బుధవారం గాలింపులు కొనసాగించామన్నారు.

మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. లక్ష సహాయం అందిస్తామని వెల్లడించారు. ఒకరు స్నానం చేయడానికి నదిలో దూకినట్లు..కానీ అతను మునిగిపోవడంతో ఇతరులు రక్షించే ప్రయత్నం చేశారన్నారు. కానీ వారు కూడా నీటిలో గల్లంతయ్యారన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని తాము పిలవడం జరిగిందన్నారు. 
Read More : రెండవ ప్రపంచయుద్ధం నాటి బాంబు పేలడంతో చనిపోయిన సైనికులు