Kolkata : దుర్గా మండపంలో..లఖింపూర్ కళారూపాలు

దుర్గాదేవి మండపంలో ఈసారి...లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించిన.. కళారూపాలు ఏర్పాటు చేయడం విశేషం.

Kolkata : దుర్గా మండపంలో..లఖింపూర్ కళారూపాలు

Kolkata

Durga Puja Pandal : భారతదేశ వ్యాప్తంగా..దసరా నవరాత్రులు మొదలయ్యాయి. మొత్తం 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. మంటపాలను ఏర్పాటు చేసి..అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. కోల్ కతాలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. దుర్గాదేవి మండపంలో ఈసారి…లఖింపూర్ ఖేరీ ఘటనకు సంబంధించిన.. కళారూపాలు ఏర్పాటు చేయడం విశేషం. డమ్ డబ్ పార్క్ భారత్ చక్ర పండల్ లో చప్పులతో కూడిన ఆకృతి ఎంతో ఆకట్టుకొంటోంది. తెగిన చెప్పులు, రెండు పెద్ద పాదాలు..రైతుల బొమ్మలను అక్కడ ఏర్పాటు చేశారు.

Read More : Pigeon Racing Dispute: పావురాల రేసులో హత్య.. జీవిత ఖైదు, లక్ష జరిమానా

Durgamata

ఓ కారు చిత్రానికి రెండు టైర్లు ఏర్పాటు చేయడం విశేషం. వ్యవసాయం గొప్పదనం చాటేలా పచ్చని పంటపొలం బ్యాక్ గ్రౌండ్ లో దుర్గాదేవి విగ్రహాన్ని ఉంచారు. మండపంలోకి వెళ్లే…ముందు…ఓ ట్రాక్టర్ ఏర్పాటు చేసి..పెద్ద రెక్కలు ఏర్పాటు చేశారు.  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్నాయి. ఖేరీ జిల్లాలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపూర్‌ ఖేరీ జిల్లాలోని టికునియా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్​లను టికునియా-బన్​బీర్​పుర్​ సరిహద్దు వద్ద అడ్డుకున్న రైతులపై రెండు కార్లు దూసుకెళ్లిన ఘటనలో, ఆతర్వాత జరిగిన ఆందోళనలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.