దుర్గ్ హాస్పిటల్ మార్చురీలో పేరుకుపోతున్న కరోనా మృతదేహాలు

దుర్గ్ హాస్పిటల్ మార్చురీలో పేరుకుపోతున్న కరోనా మృతదేహాలు

Rising Cases

Rising Cases చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దుర్గ్‌లో కరోనా సెకండ్ వేవ్‌ కలకలం రేపుతోంది. అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్ లోని మార్చురీలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలు పేరుకుపోతున్నాయి. దుర్గ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఏడు రోజుల్లో 38 మంది మరణించారు. ఆసుపత్రి మార్చురీలో ఎనిమిది ఫ్రీజర్లు మాత్రేమే ఉన్నాయి. దీంతో 27 మృతదేహాలు మార్చురీలో పడి ఉన్నాయి.

పోస్ట్‌మార్టం నిర్వహించి మృతుల బంధువులకు అప్పగించేందు వైద్య సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలకు బంధువులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పీపీఈ కిట్లు ధరించి తుదికర్మల్లో పాల్గొంటున్నారు. కాగా, దుర్గ్ లో గత వారం రోజుల్లో ఆరు వేలకుపైగా కరోనా రోగులు ఆసుపత్రుల్లో చేరారు. కరోనా రోగుల తాకిడిని ఆసుపత్రులు తట్టుకోలేకపోతున్నాయి. సరిపడా సిబ్బంది లేక వైద్యం అందని పరిస్థితి నెలకొన్నది. ప్రతి రోజు నలుగురు లేదా ఐదుగురు కరోనాతో చనిపోతున్నారు.

కాగా కరోనా పరిస్థితిపై ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాలను దుర్గ్‌కు పంపింది. ఇక, ఛత్తీస్‌గఢ్‌లో మార్చి 20న కరోనా కేసుల సంఖ్య 6,753 ఉండగా ఏప్రిల్‌ 2 నాటికి 369 శాతం పెరిగి 28,987కు చేరింది. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న దుర్గ్‌ జిల్లాలో మంగళవారం నుంచి వారం రోజులపాటు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు.