కరోనా కోసం స్పెషల్ కేర్: 18 పోర్టబుల్ హ్యాండ్‌వాష్ స్టేషన్లు

కరోనా కోసం స్పెషల్ కేర్: 18 పోర్టబుల్ హ్యాండ్‌వాష్ స్టేషన్లు

Ahmedabad: కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి అహ్మదాబాద్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని కోసం సిటీ వ్యాప్తంగా ఉన్న 18 మురికివాడల్లో పోర్టబుల్ హ్యాండ్ వాష్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మురికి వాడల్లో శానిటేషన్, అవగాహన లోపం కారణంగా కొవిడ్ వ్యాప్తి జరుగుతుందని ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అగాఖాన్ ఏజెన్స్ ఫర్ హ్యాబిటేట్ (ఏఏహెచ్) యూనిసెఫ్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా దనిలిండా, బహ్రెంపూర్, రామోల్, వాస్నా, సార్ఖేజ్ వంటి ఐదు ప్రధాన ప్రాంతాలతో కలిపి అహ్మదాబాద్ మొత్తం 35స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తొమ్మిది స్టేషన్ల ఏర్పాటు పూర్తి అయిపోయింది.



ఏఏహెచ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మొహమ్మద్ ఇర్ఫాన్ ఖలీఫా మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు కొవిడ్-19 ప్రబలిన సమయంలోనే అందించాలనుకున్నాం. హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ అనేది స్లమ్ ప్రాంతాల్లో అందుబాటులో ఉండాలనేదే మా ఆలోచన.

ఈ స్టేషన్స్ యూజ్ చేయడం చాలా సులువు. వీటిని పెడల్స్ సహాయంతో ఆపరేట్ చేయొచ్చు. అవగాహన పెంచడం కోసం, చేతులు కడుక్కోవడం, పర్సనల్ భద్రతలు చెప్పడానికి ఈ స్టేషన్లు సహకరిస్తాయి. వీటి మెయింటైనెన్స్ కోసం కొన్ని కమిటీలను అపాయింట్ చేశారు.

అహ్మదాబాద్ సిటీ తర్వాత ఈ ప్రాజెక్టును మరో 14స్టేషన్లలో మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.