దుష్యంత్ ప్రమాణ స్వీకారం….జైలు నుంచి తండ్రి విడుదల

  • Published By: chvmurthy ,Published On : October 26, 2019 / 11:32 AM IST
దుష్యంత్ ప్రమాణ స్వీకారం….జైలు నుంచి తండ్రి విడుదల

హర్యానాలో రాజకీయం ఒక కొలిక్కి వచ్చింది. బీజేపీతో కలిసి జేజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.  దుష్యంత్ చౌతాలాకు  డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు  బీజేపీ అంగీకరించింది.  సీఎం గా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీపావళి వేళ ఆదివారం నాడు హర్యానా లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. 

గవర్నర్ ను కలిసిన మనోహర్ లాల్ ఖట్టర్, దుష్యంత్ చౌతాలా  ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరగా  గవర్నర్ అందుకు అంగీకరించారు.  ఆదివారం మధ్యాహ్నం 02.15 గంటలకు ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది.

మరోవైపు జన్ నాయక్  జనతా పార్టీ  అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా తండ్రి అజయ్  చౌతాలాకు 14  రోజులు ఫర్లో(furlough) మంజూరు చేశారు తీహార్ జైలు అధికారులు. ఫర్లో(furlough)  అనగా…. ఏడాదిలో రెండు వారాల పాటు ఖైదీలు శలవు తీసుకోవటం. దీంతో ఆయనశనివారం సాయంత్రం కానీ, ఆదివారం ఉదయం కానీ  జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.  కుమారుడు దుశ్యంత్ చౌతాలా ప్రమాణ స్వీకారానికి అజయ్ చౌతాలా హజరు కానున్నారు.