పండుగ సీజన్లో 1లక్ష 40 వేల తాత్కాలిక ఉద్యోగాలు

  • Published By: chvmurthy ,Published On : September 25, 2019 / 02:29 AM IST
పండుగ సీజన్లో 1లక్ష 40 వేల తాత్కాలిక ఉద్యోగాలు

పండుగల సీజన్లో  ఆకర్షణీయమైన ఆఫర్లతో అమ్మకాలు సాగించే ఈ-కామర్స్ సంస్ధలు ఈ సీజన్ లో భారీ సంఖ్యలో తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపాయి. దసరా దీపావళి పండుగల్లో అమ్మకాల కోసం భారత దేశంలో  90 వేల మంది తాత్కాలిక సిబందిని నియమించుకోనున్నట్లు అమెజాన్ తెలిపింది.

 క్రమబద్ధీకరణ కేంద్రాలు, డెలివరీ స్టేషన్లు, కస్టమర్‌ సేవా వంటి విభాగాల్లో వీరి నియామకం జరగనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణే నగరాల్లో తాత్కాలిక ఉద్యోగుల నియామకం జరగనున్నట్లు వివరించింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అమ్మకాలు ఎక్కువ ఉంటాయని భావిస్తున్నామని . సరైన సమయంలో  డెలివరీ చేయటానికి తాత్కాలిక ఉద్యోగులు సహాయ పడతారని అమెజాన్ తెలిపింది. 

మరో ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఈ సీజన్‌లో తాత్కాలికంగా 50,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. సప్లై చైన్, కస్టమర్‌ సపోర్ట్, లాజిస్టిక్స్‌ వంటి విభాగాల్లో వీరి అవసరం ఉంటుందని  సంస్ధ తెలిపింది.